Breaking News

గ్రామీణ స్థాయి పంచాయతీ వ్యవస్థ లో డిజిటల్ విధానంలో నగదు రహిత చెల్లింపులకు శ్రీకారం చుట్టడం జరిగిందని

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ స్థాయి పంచాయతీ వ్యవస్థ లో డిజిటల్ విధానంలో నగదు రహిత చెల్లింపులకు శ్రీకారం చుట్టడం జరిగిందని రాష్ట్ర ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బిసి సంక్షేమం, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ తెలిపారు.మంగళవారం జిల్లాలో గ్రామ పంచాయతీ లలో నగదు రహిత లావాదేవీల కార్యక్రమాన్ని కలెక్టర్ తో మంత్రి ప్రారంభించారు.దేశ స్థాయి లో ఈరోజు నుంచి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను ప్రోత్స హించడం జరుగుతున్న నేపథ్యంలో జిల్లా పరిధిలోని 300 పంచాయతీలకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యు ఆర్ కోడ్ లు ఇవ్వటం జరిగిందన్నారు. పంచాయతీ కి చెల్లించ వలసిన పన్నులు, ఇతరత్రా చెల్లింపులను నగదు రహిత రూపంలో చెల్లించే వెసులు బాటు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని తెలిపారు. యూ పి ఐ ఆధారిత చెల్లింపులు ఇకపై ప్రజల సౌకర్యార్థం తీసుకుని రావడం వల్ల జిల్లా యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా నోడల్ ఏజెన్సీ గా వ్యవహరి స్తునట్లు అధికారులు వెల్లడించారు . పి ఓ ఎస్ పరికరం, క్యూ ఆర్ కోడ్ స్కానర్ పత్రాలను అందించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ కే. మాధవీలత, ఎల్ డి ఏం .. డి ప్రసాద్, డిపివో జే ఎస్ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *