Breaking News

 ఆహుతులను అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

– వేడుకల్లో దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలు..

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆహుతులను ఆకట్టుకున్న బాల బాలికలు వేసిన నృత్యలు.. తొలుత ఆంధ్రపదేశ్ రాష్ట్ర గిరిజన పాఠశాలల బాలికలు ” రైతే రాజు.. గల్లు గల్లు ” పాటకు నృత్య రూపకం ఆకట్టుకుంది. అనంతరం వరుసగా ట్రిప్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు నుంచి.. స్వాతంత్ర్య పోరాట ఘటన నేపథ్యంలో “సునో సునో .. జలియన్ వాలా బాగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ ఘటన కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించారు. శ్రీ గౌతమి విద్యా సంస్థ ఆధ్వర్యంలో “సంఘటన ఒక యజ్ఞం – భరతమాత పాదాలకు వందనం” దేశభక్తి గీతానికి నృత్యం చేశారు. గాయత్రి నృత్య నికేతన్ ఆధ్వర్యంలో ” నమో నమో భారతాంభ ” సాంప్రదాయ నృత్య సమ్మేళనం తో ప్రదర్శన చేశారు. ప్రకాష్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ” హర్ ఘర్ తీరంగా” గీతానికి నృత్య ప్రదర్శన చేశారు. ఫ్యూచర్ స్కూల్ విద్యార్థులు “వందే మాతరం – భారత దేశం సంప్రదాయానికి ప్రతీక” గీతానికి నృత్య ప్రదర్శన చేశారు. అక్షర శ్రీ స్కూల్ విద్యార్థులు ” ఎత్తర జెండా ఎత్తర జెండా ” గీతానికి నృత్యం చేశారు.
అనంతరం ఆయా స్కూల్స్ విద్యార్థిని, విద్యార్థులతో జిల్లా ఇంఛార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, జిల్లా కలెక్టర్ తదితరులు గ్రూప్ ఫోటోలు దిగి, పిల్లలని ప్రత్యేకంగా అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *