Breaking News

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల 8 శకటాలు ప్రదర్శన అధ్యంతము ఆకట్టుకుంది.

-శకటాల ప్రదర్శనలో ప్రదమ స్థానంలో టిడ్కో శకటం నిలవగా, వ్యవసాయం, ఐసీడీఎస్ శకటాలు ద్వితీయ,తృతీయ స్థానాల్లో నిలిచాయి.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రభుత్వం అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు జిల్లాలో అమలు చేస్తున్నా విధానం ఆయా శాఖల ద్వారా శకటాల రూపంలో ప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంది. తొలుత వ్యవసాయశాఖ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖ ద్వారా రైతులకు అందిస్తున్న భరోసా, మర్కెంటింగ్ వంటి సౌకర్యాలుతో ఆకట్టుకుంది. తదుపరి మత్య్సశాఖ ఆధ్వర్యంలో ఫిష్ఆంధ్రా.. చేపల ఉత్పత్తి, ఆక్వారైతుల అభివృద్ది శకట ప్రదర్శన జరిగింది. పంచాయితీ రాజ్ స్వచ్చసంకల్పం నామట్టి నాభూమి , పర్యావరణ పరిశుభ్రతపై, గృహనిర్మాణం, టిడ్కో శకటం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు సామాన్యుడికి అందించేవిదానం.. తెలియజేస్తుంది. పియంయోజన, మహిళా సాధికారరథం .. మహిలా ప్రగతికి సోపానం అంటూ మహిళా ఆర్థిక అభివృద్ది పై శకట ప్రదర్శన జరిగింది. తదుపరి, ఐసీడీఎస్ బంగారు కొండ శకట ప్రదర్శనలో వైఎస్సార్ సంపూర్ణ పోషకారంతో పాటు జిల్లా కలెక్టరు నేతృత్వంలో బంగారు కొండ కార్యక్రమం జిల్లాలో అమలు చేస్తున్న వివరాలను తెలియజేసింది. విద్యా శకటం ద్వారా మనబడి,నాడు-నేడు పాఠశాలలు ఆధునీకరణ, మౌలిక సదుపాయాలు, డిజిటలైజేషన్ విద్యాబోధన, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాలను తెలియజేస్తూ ఆకట్టుకుంది. గ్రామీణ నీటి సరఫరా శకట ప్రదర్శన జలజీవన్ మిషన్ పథకం ద్వారా జిల్లాలో ప్రజలకు తాగునీటి సరఫరా అంశాలను కళ్లకు కట్టినట్లు శకట ప్రదర్శన ద్వారా తెలిపారు. చివరిగా రెవెన్యూ ప్రగతిరథం శకటం జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో రీసర్వే, ఓటర్ల జాబితా ప్రక్రియ, భూసేకరణ, గృహస్థలాల పట్టాలు పంపిణీ,ఒన్ టైమ్ సెటిల్ మెంట్ వంటి ప్రభుత్వం పథకాలను ప్రజలకు చేరువేస్తున్న విదానాన్ని రెవెన్యూ శకటం ద్వారా ఆకట్టుకుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *