రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురష్కరించుకుని రాజమహేంద్రవరం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ లో జరిగినటువంటి స్వాతంత్య్ర వేడుకలలో భాగంగా స్పెషల్ ఎన్పోర్ మెంట్ బ్యూరో లో పనిచేస్తున్న పిట్టా సోమశేఖర్, జిల్లా స్పెషన్ ఎన్పోర్స్మంట్ ఆఫీసర్ మరియు ఆరుగురు సిబ్బంది యొక్క సేవలను గుర్తించి వారికి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె. మాధవీలత వారి ఆధ్వర్యంలో రాష్ట్ర గౌరవ బి.సి. సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ గారి ద్వారా ప్రశంశా పత్రములను అందజేయడం జరిగినది.అదే విధంగా కమీషనర్ ఆఫ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఆంధ్రప్రదేశ్ వారు తూర్పు గోదావరి జిల్లా స్పెషల్ ఎన్పోర్స్ మెంట్ బ్యూరోలో మూడు సంవత్సరములు పని చేసిన 71 మంది సిబ్బందికి సర్వీస్ మెడల్స్ ను ఇవ్వడం జరిగినది. ఈ 71 మెడల్స్ తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ (DSED) . పిట్టా సోమశేఖర్ గారి చేతులమీదుగా సి.ఐలు – 6, ఎస్.ఐలు – 8 హెడ్ కానిస్టి బుల్స్ -11, కానిస్టేబుల్స్ – 46 మొత్తం 71 మందికి సర్వీస్ మెడక్సిను ఇవ్వడం జరిగినది.
Prajavartha Online Telugu News