-ఆంధ్ర ప్రదేశ్ సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్
-కొమ్మినేని శ్రీనివాస రావు
విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(APUWJ) 67వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు ఆ యూనియన్ సభ్యులకు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. 17 ఆగస్టు,1957 న ఏర్పడి, అప్పటినుంచి జర్నలిస్టుల సంక్షేమం కోసం “ఏ.పి.యూ.డబ్ల్యు.జె” నిరంతరం పాటుపడడం హర్షణీయమని కొమ్మినేని పేర్కొన్నారు.67వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని “సేవ్ జర్నలిజం డే” అనే ఇతివృత్తం(Theme) లో భాగంగా విలువలతో కూడిన జర్నలిజం గురించి మాట్లాడుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ జర్నలిస్టులను సత్కరించడం మంచి నిర్ణయమని, అటువంటి కార్యక్రమాలు సి.ఆర్. మీడియా అకాడమీ నిత్యం కొనసాగిస్తోందని పేర్కొన్నారు.మీడియా రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు సవాళ్లకు విలువలతో కూడిన జర్నలిజం వైపు పయనించడం ఒక్కటే పరిష్కారమని, ఆ దిశ గా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. ఇందుకు అనుగుణంగా ఆంధ్ర ప్రదేశ్ సి.ఆర్. మీడియా అకాడమీ తన వంతు పాత్రను పోషిస్తోందని ఆయన తెలిపారు.
Prajavartha Online Telugu News