Breaking News

ప్రాధాన్యత భవనాలు ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలి…

– ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలపై అనపర్తి నియోజక వర్గ స్థాయి సమీక్ష నిర్వహించాం .
-క్షేత్ర స్థాయి లో వాస్తవ పరిస్థితిపై సమీక్ష
– ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్ కృష్ణ

రాజమహేంద్రవరం ,నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని నేరుగా ప్రజల ఇంటి వద్దకే అందించే క్రమంలో పాలనా సంస్కృరణలు చేపట్టి సచివాలయ, వాలంటరీ, ఆర్బీకే వంటి వ్యవస్థలను రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని జిల్లా ఇంఛార్జిమంత్రి బీసీ సంక్షేమం సమాచార పౌరసంబంధాలు సినిమాఆటోగ్రపీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.బుధవారం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో అనపర్తి నియోజక వర్గ అభివృద్ధి మరియు సంక్షేమం పథకాలు అమలు పై జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో 10 అంశాల అజెండా అంశాలుగా ఉపాధిహామీ, విద్య, హౌసింగ్ , ప్రాధాన్యత భవనాలు, ఇండ్ల స్థలాలు, ఏపి టిడ్కో, వ్యవసాయ అనుబంధ రంగాలు, జలవనరులు, వైద్య ఆరోగ్యం, ఆర్డబ్ల్యూఎస్ పౌర సరఫరాలు పై సమీక్ష నిర్వహించారు.ఇంఛార్జి మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం మరింతగా దృష్టి కేంద్రీకరించి సహేతుకమైన నిర్ణయాలకు చక్కటి అవకాశం అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాల సాధనకు కృషి చెయ్యడం కోసం అందరం కలిసి పనిచేయావలసి ఉందన్నారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా సచివాలయ వ్యవస్థ తీసుకుని రావడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన పరిపాలన, వ్యవసాయం, ఆరోగ్యం తదితర అంశాలపై దృష్టి పెట్టి , వాటిని పూర్తి చేసే దిశగా అడుగులు వేయడం జరుగుతోందని అన్నారు. అదే క్రమంలో తదుపరి ప్రాధాన్యత సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి స్వంత ఇంటి కల సాకారం కావాలని అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎంతో బాధ్యత కలిగిన పనితీరు చూపి వారధిగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన పనులు, రహదారి పనులు సమాంతరంగా చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా స్థాయి లో పనులు చేపట్టడం జరుగుతుందని , మిగిలినవి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ కే మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు పై సమగ్రంగా సమీక్షకు ఇది ఒక వేదిక అన్నారు. ఆయా పనుల పెండింగ్ లపై సమస్య మూలాలపై చర్చించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుందన్నారు. ప్రాధాన్యత భవనాల్లో 56 శాతం భవనాలు అప్పగించడం జరిగిందని అన్నారు. మరో 30 శాతం భవనాలు పూర్తి అవ్వగా వాటిని అంద చెయ్యలన్నారు. పెండింగ్ పనులు ఎట్టిపరిస్థితుల్లో ఆగస్ట్ చివరి నాటికి పూర్తి చేయాలన్నారు. విద్యా శాఖ పరిధిలో నాడు నేడు పనులకు చెంది 128 పనులకు 83 పనులు పూర్తి చేశారని, మిగిలిన పెండింగు పనులు పూర్తి చేస్తే అందుకు అనుగుణంగా చెల్లింపులు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. హౌసింగ్ పై సమీక్ష చేస్తూ, బలభద్రపురం హౌసింగ్ లే అవుట్ నందు విద్యుద్దీకరణ పనులను పూర్తి చెయ్యాలని ఆదేశించారు. భూసేకరణ పూర్తిచేసిన 90 రోజుల్లో ఇండ్ల స్థలాలు కింద పట్టాలు పంపిణీ కు ఆర్డీవో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఎంపి మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ , నియోజక వర్గ స్థాయి సమీక్ష ద్వారా సమస్య పరిష్కారం చెయ్యాలనే ఆలోచన చెయ్యడం స్వాగతీయం అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలు, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు సంబందించి ఏమైనా పెండింగ్ లో ఉంటే వాటిని పరిష్కరించి ప్రగతి మార్గంలో జరిగేవిదంగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత రెవ్యూమీటింగ్ లో సమీక్షించిన అంశాలు తదుపరి మీటింగ్ నాటికి పూర్తి చేసేలా నియోజకవర్గంలోని ప్రజప్రతినిధులు, అధికారులు సత్వర చర్యలు చేపట్టాని సూచించారు.శాసన సభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రభుత్వంలో గ్రామ స్థాయి లోనే సమస్యలు పరిష్కారం అవ్వడం జరుగుతోందని అన్నారు. ఇంకా కొన్ని పెండింగు పనులను పూర్తి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. పెండింగు పనులపై సమీక్ష ద్వారా అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయా సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని అన్నారు. నియోజకవర్గంలో హిహెచ్సీ, సిహెచ్సీ వైద్య అధికారులు, సిబ్బంది స్థానికంగా నివాసం ఉండాలని సూచించారు.జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో రీసర్వే పనులు పై ఎమైనా సమస్యలు ఉత్పన్నమయితే స్థానిక తాహశీల్థార్లు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. రీ సర్వే ప్రక్రియ డ్రోన్ ఆదారంగా జరుగుతుందని ఎటువంటి తేడాలకు తావులేదన్నారు.సమావేశంలో సీపీవో ఏ.ముఖలింగం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, ఎస్. మాధవరావు, డిహెచ్ఓ, హోసింగ్ డి. హెచ్. ఓ, పరశు రామ్, డియంహెచ్ఓ డా. కె.వెంకటేశ్వరరావు, ఉద్యాన వన శాఖ వి.రాథా కృష్ణ, పశుసంవర్ధక శాఖ అధికారి ఎస్ జీ టి సత్య గోవింద్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ కె. విజయ కుమారి,డి ఈఓ, ఎస్. అబ్రహం, ఎస్.ఈ. పి. ఆర్, ఎ బి వి ప్రసాద్, ఎస్ ఈ ఆర్ డబ్ల్యు ఎస్ డి. బాల శంకర రావు, డి ఎల్ డివో వి. శాంత మణి, డిఆర్డీఏ పిడి,ఎస్. సుభాషిణి, నియోజకవర్గ ప్రజాప్రతి నిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *