Breaking News

కాపవరం హౌసింగ్ లే అవుట్ పరిశీలన

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రస్థాయి లో హౌసింగ్ గృహ ప్రవేశాల కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో కొవ్వూరు మండలం కాపవరం లే అవుట్ లో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించ నున్నామని పూర్వపు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా ల హౌసింగ్ నోడల్ అధికారి చీఫ్ ఇంజనీర్ జి వి ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం కాపవరం హౌసింగ్ లే అవుట్ ను జిల్లా హౌసింగ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ జి వి ప్రసాద్ మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గృహ ప్రవేశాల కార్యక్రమం కాపవరం లో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. జగనన్న లేఅవుట్ ని మోడల్ కాలనీగా తీర్చి దిద్దాలని ఆదేశించారు. ఇళ్లు కట్టుకున్న లబ్దిదారులు అందరికీ నిర్మాణ పనులకు చెందిన బిల్స్ అప్లోడ్ చేసి చెల్లింపులు జరపాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగనన్న లేఅవుట్ లో నిర్మించబడి ఉన్న ఆర్చ్ ని సందర్శించి తగిన సూచనలు చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

చీఫ్ ఇంజనీర్ వెంట జిల్లా హౌసింగ్ అధికారి జి. పరశురామ్, , డి ఈ టి. శేఖర్ బాబు, ఏ ఈ కే ఎస్ చక్రవర్తి, పంచాయతీ సెక్రటరీ సుబ్బలక్ష్మి, స్థానిక నాయకులు, సుంకర సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *