-సమగ్ర ఎరువులు – పోషకాలు యాజమాన్యం” అంశం పై విద్యార్థులకు అవహాన సదస్సు
-అసోసియేట్ డీన్ డా.శ్యామ్ రాజ్ నాయక్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వరి పంటలో అధిక, సుస్థిర దిగుబడులు సాధించాలంటే పోషక పదార్థాలు సమతుల్యంగా తగిన మోతాదులో అందించే విధంగా సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టి సమతుల్యంగా పోషక పదార్థాలు వాడితే పంట దిగుబడి పెరుగుతుందని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా.శ్యామ్ రాజ్ నాయక్ అన్నారు. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ వజ్రత్సవాల్లో భాగంగా బుధవారం రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాలలో సమగ్ర ఎరువులు – పోషకాలు యాజమాన్యం” అంశం పై విద్యార్థులతో సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డా. శ్యామ్ రాజ్ నాయక్ మాట్లాడుతూ వ్యవసాయ విశ్వ విద్యాలయం 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కళాశాల విద్యార్ధులకు సదస్సులు ద్వారా వ్యవసాయంలో శాస్త్రీయమైన పలు అంశాలను అవగాహన కార్యక్రమాలు ద్వారా తెలియజేస్తున్నామన్నారు.
తెలంగాణా వ్యవసాయ విశ్వ విద్యాలయం, హైదరాబాదు నుండి సదస్సు కు విచ్చేసిన ప్రఖ్యాత భూసార శాస్త్ర వేత్త డా. పి. చంద్రశేఖరరావు మాట్లాడుతూ సమగ్ర పోషకాలు – యజమాన్య పద్ధతులపై పలు సూచనలు అందజేశారు. పంట అవసరాన్ని బట్టి, భూసార సహజ వనరుల శక్తిని సమన్వయం చేసి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల వాడకం నిష్పత్తిని నిర్ణయించాలన్నారు.
ప్రొఫెసర్ భూసార శాస్త్ర విభాగం ప్రధాన అధిపతి డా.విజయ్ శంకర్ సదస్సు నిర్వాహాణకు విద్యార్థులు, అధ్యాపకులకు వారు అను సంధాన కర్తగా వ్యవహారించారు.
అవగాహన సదస్సులో కళాశాల అధ్యాపకులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News