Breaking News

పోలింగ్ కేంద్రం వారీగా రాజకీయ పార్టీలు ఏజెంట్ నియామకం చేపట్టాలి

-ఎన్నికల సమయంలో వారికి పోలింగ్ బూత్ స్థాయి లో చక్కటి అవగాహన అవకాశం ఉంటుంది
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుతం 2024 ఎస్ ఎస్ ఆర్ ప్రక్రియ లో భాగంగా డోర్ టూ డోర్ సర్వే నిర్వహించడం జరుగుతోందని, ఆగస్ట్ 22 వరకు ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు బూత్ స్థాయి అధికారి క్షేత్ర స్థాయి లో పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఆగస్ట్ 9 నుంచి ఆగస్టు 16 వరకు జరుగుతున్న డోర్ టూ సర్వే ఓటరు గుర్తింపు పై కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జీ. నరసింహులు తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హేతుబద్ధత కలిగిన ఓటరు జాబితా రూపకల్పన కోసం ఇంటింటికీ బి ఎల్ వో వెళ్లి ఓటరు జాబితా ప్రకారం ఓటర్లను గుర్తిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు తప్పనిసరిగా బూత్ స్థాయి ఏజెంట్ ను నియమించి ఆ జాబితా ఇవ్వాలని కోరారు. ఆ జాబితాను ఆయా బి ఎల్ వో కు, తహశీల్దార్ కి , ఇ ఆర్ ఓ లకు పంపుతామని మాధవీలత తెలిపారు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల జరిగే నాటికి రాజకీయ పార్టీలు నియమించిన అధికారిక ఎజెంట్ కు ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్ల పై స్పష్టత వస్తుందని అన్నారు. ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జీ. నరసింహులు , రాజకీయ పార్టీలు ప్రతినిధులు పాల్గొన్నారు.

పంచాయతీ వార్డుల ఎన్నికలు :
అనంతరం ఈనెల 19 న జిల్లాలో 8 వార్డులకు జరిగే ఎన్నికలపై జిల్లా పంచాయతీ అధికారి జే వి సత్యనారాయణ తో కలెక్టర్ మాధవీలత సమీక్ష నిర్వహించారు.
జిల్లాకు చెంది 22 పంచాయతీ వార్డులకు ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. వాటిలో 13 చోట్ల ఏకగ్రీవం కాగా, తొమ్మిది చోట్ల ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు.

కోరుకొండ పంచాయతీ బుచ్చెం పేట 7వ వార్డు కి ఒక నామినేషన్ దాఖలు కాగా తిరస్కరణ కు గురి అయినట్లు తెలిపారు. మిగిలిన ఎనిమిది వార్డ్ ల కోసం 18 మంది నామినేషన్లు వేసినట్లు తెలిపారు. అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామం లో 1వ, 9 వ వార్డులకు, రాజానగరం పల్ల కడియం 4 వ వార్డు, కలవచేర్ల 12వ వార్డు, గోపాలపురం మండలం/పంచాయతీ లోని 12 వ, 16 వ వార్డులకు , ఉండ్రాజవరం మండలం దొమ్మెన్ను లో 9 వ వార్డు, కొవ్వూరు మండలం ఐ. పంగిడి పంచాయతీ 8 వ వార్డు కి ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *