-జాతీయ జెండా సృష్టి కర్త పింగళి వెంకయ్య విగ్రహ ప్రతిష్ట
– ప్రపంచ దేశాలకు భారతదేశం ఆదర్శంగా నిలవాలి
– స్వాతంత్ర సమరయోధులు, వీర జవాన్లకు సత్కారం
– ‘నా భూమి-నా దేశం’ కార్యక్రమంలో శిలాఫలకం ఆవిష్కరణ
– మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యుల సత్కార సభలో
– పింగళ వెంకయ్య జీవిత చరిత్ర కరపత్రాలు ఆవిష్కరణ
-జిల్లా కలెక్టర్. మాధవీలత, ఎంపీ భరత్ రామ్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్రోద్యమంలో దేశం కోసం త్యాగం చేసిన త్యాగధనుల స్ఫూర్తిని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనపై ఉందని, జాతీయ పతాక రూప శిల్పి పింగళి వెంకయ్య స్ఫూర్తి ప్రదాత అని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత పేర్కొన్నారు.గురువారం స్థానిక కోటిపల్లి బస్టాండు నందు గల స్వాతంత్య్ర సమరయోధుల పార్కులో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఆవిష్కరించి, అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా”నా మట్టి నా దేశం” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాధవీలత, పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్ రామ్, మున్సిపల్ కమిషనర్ కే దినేష్ కుమార్, మాజీ సైనికులు, విద్యార్థులతో కలిసి ఘనంగానిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డా. కే. మాధవీలత మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో దేశ కోసం పోరాడిన త్యాగదనుల వీరగాథలు , జీవిత విశేషాలు భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. దేశ రక్షణ కొరకు సరిహద్దు ప్రాంతాల్లో దేశ సంరక్షణే లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న వీర సైనికులను స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకొవలసిన అవసరం ఉందన్నారు. స్వచ్ఛమైన మట్టి, గాలి సమగ్ర అభివృద్ధి ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ‘నా భూమి- నా దేశం’ కార్యక్రమా లను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నా మన్నారు.ఈ సందర్భంగా దేశ ప్రజల సంరక్షణ లక్ష్యంగా దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తు పదవి విరమణ చేసిన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ నేడు వారిని ఘనంగా సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మాజీ సైనికుల విజ్ఞప్తిని పరిశీలించి, అనుకూల చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. జాతీయ పతాక సృష్టి కర్త పింగళి వెంకయ్య ప్రతీ ఒక్కరిలో జాతీయ భావాన్ని పెంపొందించడంలో జాతీయ పతాకానికి రూపకల్పన చేసి కీలకపాత్ర పోషించినట్లు పేర్కొన్నారు.ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ మన భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలైందని, మరో రెండున్నర దశాబ్దాలకు శత వసంతాలు పూర్తి కావస్తుందని, అప్పటికి దేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలన్నది ప్రధాని సహా అందరి ఆకాంక్ష అని పేర్కొన్నారు. భారత దేశం ప్రపంచంలోనే ఉన్నతమైనదిగా,అగ్రగామిగా, దిక్సూచికగా, విశ్వ గురువుగా ఆవిర్భావం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అదే స్ఫూర్తితో రాబోయే 25 ఏళ్లు అమృత కాలంలో ప్రపంచంలో భారత దేశం అభివృద్ధి సాధించి , దిక్సూచిగా నిలిచేలా అభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేయడం జరుగుతుందని అన్నారు. ఆక్రమంలో అడుగులు వేయడం ద్వారా ప్రతి ఒక్క పౌరుడు తన వంతు కర్తవ్యం నిర్వర్తించాలని పిలుపు నిచ్చారు.మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ మేరీ మట్టి మేరీ దేశ్ కార్యక్రమం లో భాగంగా వీరులకు వందనం కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.ఈ సందర్భముగా దేశ సరిహద్దు ప్రాంతాల్లో సేవలు అందించి పదవి విరమణ చేసిన వివిధ క్యాడర్లకు సంబంధించిన వీర సైనికులు.. ఎస్ రాజేంద్ర బాబు, ఎస్. కృష్ణ కుమార్, రాజేంద్ర కుమార్,ఆర్. రవి, బి. వెంకన్న,సయ్యద్ జుల్ఫికర్ అలీషా, సుబ్ హుస్సేన్, సుబ్బ లక్ష్మి వైఫ్ఆఫ్ కిషన్,బి. సూర్యనారాయణ,కే. వర ప్రసాద్,బి.చంద్ర శేఖర్,జి ఎ రామయ్య, నాయక్, మహ్మద్ అజీజ్ రెహమాన్, లెఫ్టినెంట్ కల్నల్ బి.సత్యనారాయణ, ఎయిర్ ఫోర్స్ మాజీ పైలట్ ప్రసాద్ లను దృశ్యాలువా తో మెమెంటోలు నందించి ఘనంగా సత్కరించారు.ఈ సందర్బంగా మహాత్మా గాంధీ తదితర జాతీయ నేతలు, స్వతంత్ర సమతయోధుల విగ్రహాలకు ఖద్దరు దండలు వేసి నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని కలెక్టర్,ఎంపీ, మున్సిపల్ కమిషనర్, అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. గాలిలోకి బెలూన్లు విడిచారు. దేశ సేవకు ఎప్పుడూ సిద్ధమేనంటూ కార్యక్రమానికి అందరి చేత “భారతదేశ సమగ్ర అభివృద్ధికి నావంతు కృషి నేను చేస్తానని పరాయి పాలనా భావజాల శేషములున్న యెడల వాటినన్నిటిని తొలగిస్తానని మనదేశ సాంస్కృతిక వారసత్వ సంపదని పరిరక్షిస్తానని దేశ సమగ్రతకు, ఐక్యమత్యమునకు సర్వదా పాటు పడతానని నాదేశం పట్ల నేను నిర్వర్తించవలసిన విధులను మరియు బాధ్యతలను నిర్వర్తిస్తానని దేశం కోసం త్యాగం చేసిన త్యాగధనులను గౌరవిస్తానని దేశరక్షణ మరియు దేశపురోగతికి నేను పునరంకితమవుతామని ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో అర్బన్ కోఆర్డినేటర్ గూడూరు శ్రీనివాస్, సిటీ అధ్యక్షులు అడప హరి, పశుసంవర్ధక శాఖ అధికారి ఎస్ డి ఎస్ సత్యగోవిందం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు, డిపిఓ జే . సత్యనారాయణ, డ్వామా పీడీ పీ. జగదాంబ, ఐసిడిఎస్ పీడీ కే. విజయలక్ష్మి, ఇతర జిల్లా అధికారులు విద్యార్థులు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News