Breaking News

ఆగస్ట్ 25 శుక్రవారం రోజున ఉద్యోగుల ఫిర్యాదుల స్వీకార దినోత్సవం

 

– సిఎం పర్యటన నేపథ్యంలో 4వ శుక్రవారానికి వాయిదా
-జిల్లా కలెక్టరేట్ స్పందన హల్ లో సా.4.00 నుంచి అర్జీల స్వీకరణ
– జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల మూడో శుక్రవారం ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆగస్ట్ 25 శుక్రవారం నిర్వహిస్తామని గురువారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలియ చేశారు.ప్రతి నెల మూడో శుక్రవారం నిర్వహించాల్సి ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిడదవోలు పర్యటన నేపథ్యంలో ఆగస్ట్ నెలలో 18 వ తేదీకి బదులు 25 వ తేదీన నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం నిర్ణయించారని మాధవీలత తెలిపారు.కావున ఉద్యోగులు ఈ మార్పును గమనించి ఆగస్ట్ 25 ఉద్యోగుల గ్రేవియాన్స్ డే రోజున ప్రభుత్వ ఉద్యోగులు వారికి చెందిన అర్జీలను కలెక్టరేట్ లోని స్పందన హల్ నందు సా 4.00 గంటల నుంచి అందుబాటులో ఉండడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ఉద్యోగులు వారికి చెందిన వ్యక్తిగత, తదితర అర్జీలను వ్రాత పూర్వకంగా అందచేయాలని కలెక్టర్ తెలియ చేశారు. జిల్లాకు చెందిన ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సంబంధిత జిల్లా అధికారులు ఈ విషయం పై ఉద్యోగులకు  అవగాహన కలుగ చేయాల్సిందిగా కలెక్టర్ మాధవీలత ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *