-సెప్టెంబరు 5న వ తేదీన రాజమహేంద్రవరంలో2 కే రన్..
-తూర్పుగోదావరి, ఏలూరు బీమవరం కోనసీమ,కాకినాడ జిల్లాల ఆక్వా, మత్స్యకారరైతులతో ఫుడ్ ఫెస్టివల్
– భూమి ఆర్గానిక్, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సీ ఫుడ్ ఫెస్టివల్
-జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాలకృష్ణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మత్స్యకారుల తలసరి వినియోగాన్ని మెరుగుపర్చడమే లక్ష్యంగా వినియోగదారలకు, పారిశ్రామికవేత్తలకు ఫిష్ ఆంధ్రా బ్రాండ్ గురించి అవగాహన కల్పిస్తూ జిల్లా ఇంచార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు సీనీమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు.శనివారం స్థానిక జిల్లా కలక్టరు కార్యాలయ సమావేశమందిరంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో సెప్టెంబరు 5 న నిర్వహించే సీ ఫుడ్ ఫెస్టివల్ – 2k రన్ కార్యక్రమానికి సంబందించిన పోస్టరును మంత్రి వేణుగోపాల్, జిల్లాకలెక్టరు, యంపి మార్గాని భరత్ రామ్, శాసనసభ్యులు జక్కంపూడి రాజా, జ్యోతుల చంటిబాబు, జేసీ ఎన్. తేజ్ భరత్ లు, భూమి ఆర్గానిక్ యండి మావులూరి రఘరామ్, మత్స్యశాఖ జేడీ వి. కృష్ణారావు తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఔత్సాహిక మత్స్యకార రైతులు ఉత్పత్తిదారులు, పెద్ద ఎత్తున ఆర్గానిక్ ఫుడ్ ఫెస్టివల్ లోపాల్గొంటారన్నారు. సెప్టెంబరు 5 వ తేదీన ఫిష్ ఆంద్రా బ్రాండ్ క్రింద మత్య్సశాఖ ద్వారా నాలెడ్జి పార్టనర్ గా ఆర్గానిక్ ఫుడ్ ఇండస్ట్రీలో ఆధ్వరంలో నిర్వహిస్తున్నామన్నారు. సెప్టెంబరు 8,9, 10 తేదీల్లో రాజమహేంద్రవరం పట్టణంలోని హోటల్ మంజీరా లో జోనల్ స్థాయి సీ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత మాట్లాడుతూ స్థానికంగా ఉత్పత్తి అయ్యే మత్య్స వినియోగాన్ని పెంపొందించిమత్స్యకారులకు మరియు ఆక్వా రైతులకు ప్రత్యామ్నాయ మార్కెట్ ను అందించేదుకు ఫిష్ ఆంధ్ర బ్రాండ్ ద్వారా దేశీయ మార్కెటింగ్ కు ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, మైక్రో పుడ ప్రోసెసింగ్ ఎంట్రిప్యూనర్స్ సబ్సిడీలను ద్వారా రిటైల్ చేపల దుకాణాలను ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తలకు సహాయం తో వినియోగదారులకు అందుబాటు ధరలకు నాణ్యమైన చేపలు ఫిష్ ఆంధ్రా ముఖ్యఉద్దేశ్యం అన్నారు.సమావేశంలో జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్, డీఆర్వో జి. నరశింహులు ఆర్డీఓ ఏ. చైత్రవర్షిణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News