-డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పార్క్ సందర్శన అధికారులకు పలు ఆదేశాలు
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజలకు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మరియు ఆరోగ్యకరమైన ఆహ్లదకరమైన వాతావరణని కల్పించే, విజయవాడ విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, చివరిదశ పనులను అంబేద్కర్ పార్క్ ను క్షేత్రస్తాయిలో పరిశీలించారు.అందులో భాగంగా, పార్క్ ఆవరణలో కొత్తగా నిర్మించిన సైకిల్ ట్రాక్‌పై ట్రయల్ పై నగరపాలక సంస్థ అధికారులు ట్రయిల్ రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్క్ ఆవరణలో పచ్చదనాన్ని పూర్తిస్థాయిలో పెంపొందించుట జరిగిందని, అభివృద్ధిలో చివరి దశకు చేరుకుందని, నగర ప్రజలకు విశ్రాంతి మరియు వ్యాయామానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేలా ఈ పార్కును అభివృద్ధిపరచుట జరిగిందని అన్నారు.సైక్లింగ్ మరియు వ్యాయామాలు చేసేవారికి ఈ పార్కు వాతావరణం మరింత అనుకూలంగా ఉంటుందని అన్నారు.అంబేద్కర్ పార్క్ అభివృద్ధి పట్ల తన సంతృప్తిని వ్యక్తం చేశారు మరియు పెంపొందించే విధముగా నగర ప్రజలకు ఆరోగ్యము ,ఆహ్లాదం ఒకే చోట సమకూర్చుట జరిగినదని చెప్పారు. వచ్చే వారంలోగా అంబేద్కర్ పార్కును ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.మౌలిక సదుపాయాల అభివృద్ధి పట్ల కమీషనర్ క్షేత్రస్థాయిలో సౌకర్యాలను పర్యవేక్షించి ప్రజల యొక్క సమస్యలను ఆడిగితెలుసుకుని , వారు కోరిన విధమిగా మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకొనుటలో కమిషనర్ అంకిత భావం అర్ధమవుతుంది, అంబేద్కర్ పార్క్ ప్రారంభోత్సవం కోసం విజయవాడ వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.పర్యటనలో అదనపు కమీషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి , సూపరింటెండింగ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్స్), కె. రామమోహనరావు, ఏ.డి.హెచ్ శ్రీనివాస్ , RFO వెంకటేశ్వరావు , SFO రాజ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News