రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం ఆంధ్రప్రదేశ్ జువెనైల్ జస్టిస్ కమిటీ వారి ఆదేశాలతో తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత వారి ఆధ్వర్యంలో జువెనైల్ జస్టిస్ కు సంబందించిన ప్రధాన స్టేక్ హోల్డర్స్ తో జిల్లా స్థాయి వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా బాలలు నేరాలు చేయకుండా తీసుకోవాల్సిన చర్యలు మరియు పాఠశాల స్థాయిలోని పాఠ్యాంశాలలో చేయవలసిన మార్పులు గురించి మాట్లాడారు.ఏయే ప్రాంతాలలో మాదక ద్రవ్యాల వినియోగం మరియు బాలల నేరాలు అధికంగా జరుగుతున్నాయో గుర్తించాలని సంబందిత అధికారులకు సూచించారు. ఈ విషయాల పై అన్ని స్థాయిల అధికారుల నుండి సలహాలు మరియు సూచనలు స్వీకరించడం జరిగింది.చట్టంతో విబేధించిన బాలల విషయంలో వివిధ శాఖల అధికారులు పాటించాల్సిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. చట్టంతో విబేధించిన బాలలలో పరివర్తన తీసుకురావాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు. ఈ క్రమంలో చాలా సున్నితంగా, స్నేహా పూర్వకంగా వారితో వ్యవహ రించాలని తెలియజేశారు.చట్టంతో విబేధించిన బాలలకు ఉచిత న్యాయ సేవలు అందించ బడతాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి తెలిపారు. ఎలాంటి న్యాయ సందేహాలు ఉన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థని సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, జువెనైల్ జస్టిస్ బోర్డ్ సభ్యులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, విద్యాశాకాధికారులు, స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ సభ్యులు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ అదికారులు, మెంటల్ హెల్త్ ఆఫీసర్, తదితరులు పాల్గొన్నారు.అనంతరం సెప్టెంబరు 9 వ తేదీన జరగబోవు జాతీయ లోక్ అదాలత్ కోసం పోలీస్ అదికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసుల పరిష్కార మయ్యేందుకు చర్యలు తీసుకోవలసిందిగా సూచించారు.
Prajavartha Online Telugu News