Breaking News

నగరంలో వ్యర్ధాల సేకరణ ప్రణాళికాబద్దంగా జరగాలని

గుంటూరు ,నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో వ్యర్ధాల సేకరణ ప్రణాళికాబద్దంగా జరగాలని, పారిశుధ్య నిర్వహణపై ప్రజల నుండి అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, సచివాలయ కార్యదర్శుల పై కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్  కీర్తి చేకూరి స్పష్టం చేశారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజారోగ్య, ఇంజినీరింగ్, హౌసింగ్ అధికారులతో పారిశుధ్యం, ఈ-ఆటోల నిర్వహణ, వినియోగం, గడపగడపకు మన ప్రభుత్వం పనుల పురోగతి, జగనన్న లే అవుట్స్ లో ఇళ్ళ నిర్మాణ పనులు తదితర అంశాలపై ప్రజారోగ్య, ఇంజినీరింగ్, హౌసింగ్ అధికారులు, కాంట్రాక్టర్స్, ఎమినిటి కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య పనులు పక్కాగా జరగాలని, ఇంటింటి చెత్త సేకరణకు ఈ-ఆటోలను కేటాయించినా కొన్ని ప్రాంతాల్లో పారిశుధ్య పనులు మెరుగ్గా జరగడం లేదన్నారు. ప్రధాన రోడ్ల వెంబడి వ్యర్ధాల కుప్పలు ఉంటున్నాయన్నారు. ఈ-అటోలను కేవలం ఇంటింటి చెత్త సేకరణకు మాత్రమె వినియోగించాలని, సెకండరి కలెక్షన్ కు వినియోగిస్తే సంబందిత శానిటేషన్ కార్యదర్శి, ఇన్స్పెక్టర్ లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలో ఇక నుండి ఉదయం 6 గంటల నుండే చెత్త సేకరణ ప్రారంభించాలన్నారు. గ్యాంగ్ వర్క్ సమయంలో స్థానిక కార్పొరేటర్లతో సమన్వయం చేసుకోవాలని, గార్బేజ్ ట్రాన్సఫర్ స్టేషన్ల వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించాలన్నారు. ఆటోల డ్రైవింగ్ పై కార్మికులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఏఈ, డిఈఈలు తమ పరిధిలోని ప్రజారోగ్య అధికారులతో సమన్వయం చేసుకొని, చార్జింగ్ పాయింట్స్, ఆటోల నిర్వహణ పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. వార్డ్ ల వారిగా గడప గడపకు మన ప్రభుత్వంలో ఆమోదించిన అభివృద్ధి పనులను ఏ.ఈ.లు మరింత వేగంగా చేపట్టాలని, బిల్స్ కూడా అప్ లోడ్ చేయాలన్నారు.అనంతరం జగనన్న లే అవుట్స్ ల్లో ఇళ్ళ నిర్మాణ పనుల పై సమీక్ష చేసిన కమిషనర్ మాట్లాడుతూ ఇళ్ళ నిర్మాణ కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టర్లు ఇచ్చిన టార్గెట్ మేరకు పనులు చేయడం లేదని, నోడల్, హౌసింగ్ అధికారులు మరింత భాధ్యతగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. లే అవుట్స్ల్లో ఇసుక, రోడ్ల వంటి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంట్రాక్టర్లు రోజువారీ పురోగతి చుపాలన్నారు. ఎమినిటి కార్యదర్శులు ఎప్పటికప్పుడు మార్కింగ్ ఇస్తూ, బిల్స్ కూడా పెండింగ్ లేకుండా అప్ లోడ్ చేయాలన్నారు.సమావేశంలో ఎస్.ఈ. భాస్కర్, డిప్యూటీ కమిషనర్ డి.రవీంధ్ర, హౌసింగ్ పి.డి. వేణు గోపాల్, ఈ.ఈ. శంకర్రావు, ఎం.హెచ్.ఓ. డాక్టర్ భాను ప్రకాష్, ఈ.ఈ.లు సుందరరామిరెడ్డి, కొండారెడ్డి, కోటేశ్వరరావు, శ్రీనివాస్, యస్.యస్.లు , డిఈఈలు, ఏ.ఈ.లు, హౌసింగ్ లే అవుట్స్ కాంట్రాక్టర్స్, ఎమినిటి కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *