Breaking News

నగరపాలక సంస్థ కార్మికుల శ్రేయస్సే ప్రధాన లక్ష్యం..కమిషనర్ కీర్తి చేకూరి

గుంటూరు ,నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థలో విధులు నిర్వహించే అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారనికి అధిక ప్రాధాన్యతతో కృషి చేస్తున్నామని, ఈఎస్ఐ కార్డ్స్ అప్ డేషన్ క్యాంప్ అవసరమైతే మరో రెండు రోజులు పొడిగించేలా చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న ఈయస్ఐ కార్డ్స్ అప్ డేషన్ క్యాంప్ ని అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, ఎస్.ఈ.లతో కలిసి పరిశీలించి కార్మికులతో మాట్లాడారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈఎస్ఐ నూతన నిబందనల మేరకు కార్మికులందరూ తప్పనిసరిగా తమ ఈఎస్ఐ కార్డ్ లను కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్ లతో అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం నుండి శుక్రవారం వరకు అప్కాస్ అధికారులు, సిబ్బంది సహకారంతో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేశామని, అవసరమైతే మరో రెండు రోజులు క్యాంప్ ఉండేలా చూస్తామన్నారు. కార్మికులు తమ ఆధార్ తో పాటుగా కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్ లు, ఫ్యామిలి ఫోటో తదితర వివరాలతో అప్ డేట్ చేసుకోవాలని కోరారు. క్యాంప్ కి హాజరయ్యే కార్మికుల సంఖ్యకు తగిన విధంగా కంప్యూటర్ ఆపరేటర్లను, త్రాగునీరు వంటి కనీస వసతులు కల్పించామన్నారు. క్యాంప్ లో ఏవిధమైన సమస్యలు లేకుండా నగరపాలక సంస్థ మేనేజర్ పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు.ఉద్యోగులతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారానికి నగరపాలక సంస్థ అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఎక్కడాలేని విధంగా అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఇన్సూరెన్స్ వార్షిక ప్రీమియం పూర్తిగా కూడా నగరపాలక సంస్థే చెల్లిస్తుందన్నారు. కొందరు కార్మికులు పిఎఫ్ ఖాతాలకు సంబందించి ఫిర్యాదులు చేశారని, అటువంటి వారు కూడా ఈ క్యాంప్ లోనే ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ లో అర్జీలు ఇస్తే త్వరలో పరిష్కారనికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.కార్యక్రమంలో అదనపు కమిషనర్ పెద్ది రోజా, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు. సిహెచ్.శ్రీనివాస్, డి.రవీంధ్ర, ఎస్.ఈ. భాస్కర్, ఎంహెచ్ఓ డాక్టర్ భాను ప్రకాష్, మేనేజర్ శివన్నారాయణ, ఎస్.ఎస్.లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *