రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో ఆర్డీవో తరపున కె.ఆర్.సి. సబ్ కలెక్టర్ కార్యాలయం, రాజమహేంద్రవరం తహసీల్దార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎ. శ్రీనివాసరావు ప్రజల వొచ్చిన 5 అర్జీలను స్వీకరించారు. ఈరోజు రెవిన్యూ, నేషనల్ హైవే , పౌరసరఫరాలు అంశాలకు సంబంధిచి ఐదుగురు నుంచి అర్జీలను స్వీకరించా మన్నారు.ప్రజాసమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం స్పందన, జేకేసి, ఇప్పుడు జగనన్న సురక్ష ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ పరిపాలన అధికారి జిఎఎల్ఎస్. దేవి, మునిసిపల్ కార్పొరేషన్, డివిజనల్ పంచాయతీ అధికారి, ఐసిడిఎస్ సివిల్ సప్లైస్, బిసి వెల్ఫేర్, ఏపీఎస్ఆర్టీసీ, హౌసింగ్, ఇరిగేషన్, ఆర్.డబ్ల్యూఎస్, ఫైర్, సాంఘిక సంక్షేమ, వైద్య, ఆరోగ్య, లేబర్, పశుసంవర్ధక, పరిశ్రమలు, డాక్టర్ ఎస్సార్ ఆరోగ్యశ్రీ తదితర డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News