Breaking News

స్పందన లో వొచ్చిన 25 అర్జి లు పి ఎం సత్యవేణి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవటం జరుగుతుందని, ఆమేరకు క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది అర్జీలను పరిష్కారానికి చొరవ చూపాలని మున్సిపల్ అదనపు కమిషనర్ ఎం. సత్య వేణి అన్నారు.సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మున్సిపల్ అదనపు కమిషనర్ ఎం. సత్యవేణి, తదితరులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా సత్యవేణి ప్రజల నుంచి అర్జీలను స్వికరించారు.వాంబే గృహాల ఇంటి పన్ను వేయుట గురించి, టిడ్కో ఇల్లు మంజూరు చేయవలసిందిగా కోరుట గురించి, ఇంటికి అడ్డంగా ఉన్న చెట్టును తొలగించ వలసిందిగా కోరుట, రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ఇంటిపన్ను, పారిశుద్యం, వీధి దీపాలు వంటి తదితర అంశాలపై 25 వినతులు స్వీకరించామన్నారు . ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం స్పందన , జేకేసి ద్వారా అర్జీలు తీసుకోవడం జరుగు తోందని అన్నారు. అర్హత ఉన్న సంక్షేమం పథకాలు అమలు కానీ వారిని గుర్తించి జగనన్న సురక్ష ద్వారా ఆ పథకాలు అమలు చేయడం పై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సత్యవేణి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఎం సి సూపరెంటెండెంట్ ఇంజనీర్ జి. పాండు రంగారావు, సిటీ ప్లానర్ జివి ఎస్ ఎన్ మూర్తి, ఇతర మునిసిపల్ అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *