Breaking News

 బాల్య వివాహాలు అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి

-జిల్లా స్థాయి లో ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 4156 వారం రోజుల్లో అందుబాటులోకి
– చదువుపై ఆసక్తి ఉండి సంప్రదిస్తే జిల్లా యంత్రాంగం అండగా నిలుస్తుంది
-బాల్య వివాహం చదువుకి ఆటంకం కారదన్న అభిలాష మేరకు కావ్య ను ఇంటర్ లో చేర్పించడం జరిగింది
– జిల్లా వ్యాప్తంగా 907 మంది బాల్య వివాహ బాలికలకు రక్షణగా అధికారులు
– 1556 అంగన్వాడీ కేంద్రాల ద్వారా పర్యవేక్షణ
– బాలల హక్కులు పరిరక్షణ కోసం చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098
– బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు ఫిర్యాదు టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 3535
– కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
బాల్య వివాహాలు వలన జరిగే అనర్థాలను గుర్తించి, అడ్డంకుల అధిగమించి వాటిని ధైర్యంగా వ్యతిరేకించి చదువు కోవడానికి ముందుకు వచ్చిన “కే. కావ్య” మరింత మందికి స్ఫూర్తిగా నిలవడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.శనివారం ఉదయం స్థానిక  కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల, రాజమండ్రి ఇంటర్మీడియెట్ చదువుతున్న కె. కావ్య ను కలిసి కలెక్టర్ అభినందించారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో బాల్య వివాహాలు అరికట్టేందుకు 907 మంది బాల్య వివాహాల బాలికలకు రక్షణగా అధికారులను నియమించడం జరిగిందన్నారు. క్షేత్ర స్థాయి లో బాల్య వివాహాలు జరుగకుండా అనునిత్యం పర్యవేక్షణ బాధ్యతలను 1556 అంగన్వాడీ కేంద్రాల ద్వారా కూడా నిర్వర్తించడం జరుగుతుందన్నారు.కె.కావ్య కథనం స్ఫూర్తి పై కలెక్టర్ మాటల్లో.. తల్లితండ్రులు.. బంధువుల వత్తిడి తో రెండేళ్ల క్రితం 14 ఏళ్లకే వివాహం చేసుకున్నా …. చదువుకోవాలనే తపన తనను నిరంతరం రగులుకునేలా చేసిందన్నారు. వివాహం అనంతరం 10 వ తరగతి వరకు మేనమామ ఇంట ఇరుపాక గ్రామం (కాకినాడ జిల్లా) లో ఉంటూ ఏలేశ్వరం బాలికల పాఠశాలలో విద్యను పూర్తి చేశారు. కోరుకొండ సరస్వతి విద్యాలయం నందు ఇంటర్మీడియట్ దూరవిద్య ద్వారా చేర్పించుట జరిగినది. స్కూల్ కి వెళ్లి చదువుకోవాలనే నేపధ్యంలో 100 నంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సదరు సమాచారం తనకి చేరిన వెంటనే ఐ సి డి ఎస్ అధికారులను  రంగపట్నం కి పంపి కావ్యని చేర దీయడం జరిగిందన్నారు. ప్రస్తుతం 16 ఏళ్లు ఉన్న కావ్య కు రాజమహేంద్రవరం లోని మహిళా స్టేట్ హోమ్ నందు ఉచితంగా వసతి సౌకర్యం కల్పించి, కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల నందు చేర్పిచడం జరిగిందన్నారు. ఎంపీసీ ఇంటర్మీడియట్ లో చేరడానికి ప్రవేశ సమయం ముగియడం తో చొరవ తీసుకుని ప్రత్యేక కేసుగా పరిగణించి కళాశాలలో చేర్పించడం జరిగిందని కలెక్టర్ తెలియ చేశారు. కళాశాల కు చెందిన వసతి గృహంలో ఉండడం వల్ల తనకు మరింత భద్రత ఉంటుందని భావించిన కావ్య తన బంధువుల సహాయంతో వసతి గృహం రుసుములు చెల్లించి కళాశాల వసతి గృహంలో చేరడం జరిగిందన్నారు. జిల్లా యంత్రాంగం తరపున కావ్య చదువుకు పూర్తి భరోసా ఇచ్చామన్నారు. ఈ విషయంపై పాప తల్లితండ్రులకు అవగాహన కలుగ చెయ్యడం జరిగిందన్నారు. బాల్య వివాహాలు వలన తదుపరి వివాహ జీవనంలో ముందస్తు గర్భం దాల్చడం ద్వారా తల్లి బిడ్డల ప్రాణాలకు రక్షణ ఉండదని తెలియ చేయ్యాడం జరిగిందన్నారు. తమ కుమార్తె ఆసక్తి కి మద్దతు తెలియచేస్తూ ఆమేరకు కావ్య చదువుకు ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకుంటామని కనకాల శ్రీనివాసరావు, దేవి లు ముందుకు వచ్చి వసతి గృహం ఫీజు లు చెల్లించారని పేర్కొన్నారు.బాల్య వివాహాలు అరికట్టేందుకు తూర్పు గోదావరి జిల్లా స్థాయిలో ఫిర్యాదులకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 4156 వారం రోజుల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 కి ఫిర్యాదు చేసి తగిన సహాయం పొందవచ్చునని పేర్కొన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే ప్రజలు సామాజిక బాధ్యత వారికి తెలిసిన సమాచారం అందించాలని కలెక్టర్ మాధవీలత కోరారు. రాజ్యాంగం వలన పిల్లలకు చదువుకునే హక్కు ఉందన్నారు. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు పొందేందుకు  టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 3535 ఫిర్యాదు చేయాలని కోరారు.జిల్లాలో బాల్య వివాహాలు నివారణ కోసం మండల స్థాయిలో పిల్లల సంరక్షణ కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. బాల్య వివాహాలు అరికట్టే చర్యల్లో భాగంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మాధవీలత తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 4156 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే అటువంటి వారికి జిల్లా యంత్రాంగం అండగా ఉండి విద్య ను అందించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. బాలల పరిరక్షణ కమిటీ లు జిల్లా స్థాయి లో ఒకటి, డివిజన్ పరిధిలో రెండు, 11 ఐ సి డి ఎస్ పరిధిలో, మండల స్థాయి లో 19 తహశీల్దార్ ఆధ్వర్యంలో , 62 మంది ఐసిడిఎస్ సూపర్ వైజర్స్, 300 మంది పంచాయతీ కార్యదర్శులు, 512 గ్రామ వార్డు సచివాలయ గ్రామ రెవెన్యూ అధికారులు, 1556 అంగన్వాడీ కేంద్రాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.కావ్య మాటల్లో…. నా పేరు కావ్య.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానం పట్ల నాలో చదువుకోవాలనే ఆసక్తి పెరిగింది. బాల్య వివాహాలను వ్యతిరేకించి చదువు కొనసాగించాలి. బాల్యంలోనే వివాహం అయిన నాకు   భర్త బంధువులు పై చదువులు చదువు కోనేందుకు నాకు అవకాశం కల్పించక  పోగా బయటకు వెళ్లి చదివేందుకు వీలులేదంటూ కట్టడి చేశారు. ఈ నేపథ్యంలో చేసేదేమీ లేక  పోలీసులను ఆశ్రయించాను. చదువుకొనేందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్న నాకు జిల్లా కలెక్టర్  డా. కె. మాధవీలత  నాకు దైర్యం చెప్పి “గాడ్ మాదర్” గా నేను చదువుకొనేందుకు అండగా నిలబడి భరోసా ఇచ్చినందుకు చాలా సంతోషిస్తూ కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను.కలెక్టరమ్మ చొరవతో నన్ను అధికారులు స్టేట్ హోమ్ నందు ఉచిత వసతి సదుపాయాన్ని కల్పించి కళాశాలలో చేర్పించారు. నేను ప్రతి రోజు స్టేట్ హోం నుంచి కళాశాలకు వెళ్ళడం కంటే కాలేజీ వసతి గృహం లోనే ఉండి చదువుకుంటానని తన స్నేహితురాలిని కోరడంతో వసతి గృహంలో ఉండేందుకు సౌకర్యం కల్పించారు. చదువు పై నాకున్న ఆసక్తి కి తగ్గట్టుగా ప్రోత్సాహం ఇస్తూ మా తల్లిదండ్రులు ముందుకు రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నాకు అండగా నిలిచిన జిల్లా కలెక్టర్ వారికి, నా వెన్నంటే వుండి నాకు ధైర్యాన్ని చెబుతూ అన్నివిదాలా సహకరిస్తున్న అధికారులకు, స్నేహితులకు, తల్లితండ్రులకు ఎంతో ఋణపడి ఉంటాను. ఒక స్త్రీ చదివితే తన కుటుంబానికి, తద్వారా సమాజానికి ఎంత మేలు జరుగుతొందనే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి సందేశం తనకు ఎంతో స్ఫూర్తి నిచ్చింది.ఈ సందర్శన లో కళాశాల ప్రిన్సిపల్ పి. రాఘవ కుమారి,  జిల్లా స్త్రీ శిశు సంరక్షణ అధికారిణి కే. విజయకుమారి,  విద్యార్థినిలు , శిశు సంరక్షణ కమిటీ సభ్యులు, ఐ సి డి ఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *