-స్పందన అర్జీ రీ ఓపెన్ కాకుండా నాణ్యతో కూడిన విధంగా అధికారులు పరిష్కరించాలి.
– షెడ్యూలు ప్రకారం మండల కేంద్రాల్లో నిర్వహించే జేకేసీ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలి.
-జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి బుధ, శుక్రవారాల్లో మండల కేంద్రాల్లో షెడ్యూల్ ప్రకారం నిర్వహించే “జగనన్నకు చెబుదాం” స్పందన కార్యక్రమానికి తప్పని సరిగా జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యి ప్రజలు జేకేసీలో అందించిన అర్జీలను నిర్ణీత కాలవ్యవధిలో అర్జీదారుడు సంతృప్తి చెందే స్థాయిలో నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత పేర్కొన్నారు.సోమవారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం- స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు మాధవీలత, డీఆర్వో జి.నరశింహులుతో కలసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా జగనన్నకు చెబుదాం – స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి 173 అర్జీలను స్వీకరించామని తెలిపారు. అనంతరం కలెక్టరు మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ లను నాణ్యతతో కూడిన విధంగా గడువులోగా పరిష్కరించాలన్నారు. స్పందనలో వచ్చిన ప్రతి అర్జీనీ క్షుణ్ణంగా పరిశీలించి ఏ ఒక్క అర్జీ పెండింగ్ లేకుండా రీఓపెన్ కు తావులేకుండా పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. షెడ్యూలు ప్రకారం మండల స్థాయిలో ప్రతి బుధ, శుక్రవారాల్లో నిర్వహించే జేకేసీ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. జేకేసీలో హౌసింగ్, మెడికల్, డిఆర్డీఏ వంటి శాఖలకు సంబందించి ఎక్కువ అర్జీలు వస్తున్నాయని వాటికి వెనువెంటనే పరిష్కార మార్గం చూపాలన్నారు. పౌర సరఫరాల శాఖకు సంబందించి సెప్టెంబర్ 27 న కళా కేంద్రం లో ధాన్యం పోక్యూర్మెంట్ కు సంబందించి మండల స్థాయి ప్రత్యేకాధికారులతో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నందున జేకేసి తదుపరి స్థాయి జిల్లా స్థాయి అధికారులు హాజరుకావాలన్నారు.నేడు స్పందనలో ఆన్ లైన్ 137 ద్వారా 137 ఆఫ్ లైన్ ద్వారా 36 మొత్తం 173 అర్జీలు ప్రజల నుంచి స్వీకరించామని పేర్కొన్నారు.స్పందనలో వచ్చిన కొన్ని అర్జీలు.. రాజమహేంద్రవరం తాడితోట నివాసి మహ్మద్ షరీఫ్ తన అర్జీలో రేషన్ కార్డు నందు తన తల్లి పేరును తొలగించ మంటే.. తల్లితో పాటుగా తన భార్య పేరును కూడా తొలగించ్చారని, కావున అధికారులు నా భార్య పేరును తిరిగి రేషన్ కార్డులో చేర్చాలని వారు అర్జీలో కోరారు. నల్లజర్ల మండలం అనునిలంక, పోతినీడిపాలెం కు చెందిన జొన్నగండ్ల నరసమ్మ తమ అర్జీలో తన మామిడి తోటను కౌలుకు ఇవ్వడం జరిగిందని, అయితే నా భూమిని కౌలు చేస్తున్న రైతులు, ఆ భూమి మాది మీకు ఏమీ సంబంధం లేదంటూ గొడవ చేస్తూ నన్ను బెదిరిస్తున్నారు. కావున నా భూమిని వారి నుంచి నాకు అప్పగించ వలసిందిగా అధికారులను కోరారు. రాజమండ్రి రూరల్ మండలం దవళేశ్వరం కు చెందిన గోడి లక్ష్మి తమ అర్జీలో తనకు సంవత్సరం నుంచి రేషన్ రావడం లేదని, భర్త కుమారుడు కూడా చనిపోయారని ఎటువంటి ఆదరమూ లేదు. కావున అధికారులు తనకు రేషన్ ఇప్పించాలని కోరారు. గోకవరం మండలం ఆర్ వై పాలెం లక్ష్మీనారాయణపేట నివాసి జాజుల అవతారం తమ అర్జీలో గ్రామంలోని ఇండ్ల మధ్యలో గొర్రెలు, గేదెలు పెంపకం వలన వీదులు అపరిశుభ్రంతో వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని, రాత్రులు వీటి అరుపులకు నిద్రలేకుండా పోతుందని, పిల్లల చదువులకు ఆటంకం ఏర్పడుతుంది. కావున వాటిని వెరే స్థలానికి మార్చాలని వారు అర్జీలో కోరారు. రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామ నివాసి వారి అర్జీలో తాను 22 ఏళ్ళు ఇండియన్ ఆర్మీ లో పనిచేశానని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాకు భూమిని కేటాయించాల్సి ఉందని, అయినను ఇప్పటివరకు నాకు భూమి ఇవ్వలేదు. కావున అధికారులు నా అర్జీని పరిశీలించి భూమిని కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో డీఆర్వో జి నరశింహులు, టూరిజం ఆర్డీ వి.స్వామినాయుడు, డియంహెచ్ఓ డా. కె.వేంకటేశ్వరరావు, సీపీఓ ఎ. ముఖలింగం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. మాధవరావు, డీటీవో ఎన్. సత్యనారాయణ, డీఈఓ ఎస్ అబ్రహం, ఆర్టీవో కె.వి. కృష్ణారావు, ఎల్డీయం డీబీ ప్రసాద్, డ్వామా పి.డి..పి జగదాంబ, హౌసింగ్ పిడి.. పరశురామ్, డిఓహెచ్ఓ ఎస్టీజీ సత్యగోవిందం, డీసీహెచ్ ఓ డా. ఎన్. సనత్ కుమారి, డిఎంహెచ్ఓ డా. కె.వెంకటేశ్వరరావు, డిఆర్డిఏ పిడి సుభాషిణి, ఆర్ డబ్ల్యూ ఎస్ పిడి బాలశంకర్, డిటిడబ్ల్యూఓ అధికారిణి జ్యోతి, పలువురు జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News