విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాయలం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు.నగరంలోని కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్, శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, మైలవరం శాసనభ్యులు వసంత కృష్ణప్రసాద్, తూర్పు ఇన్చార్జ్ దేవినేని అవినాష్, జిల్లాకు చెందిన వైద్యాధికారులు వర్చువల్గా వీక్షించి. అనంతరం జిల్లా స్థాయి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించి రోగులకు అందించే ఫోల్డర్స్ బ్యాగ్స్ ను విడుదల చేశారు.అనంతరం ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు | ఆరోగ్యంగా సురక్షితంగా ఉండాలని జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. అధికారులు స్థానిక ప్రజాప్రతిధుల సమన్వయంతో ఆరోగ్య సురక్షతను విజయవంతం చేయాలన్నారు. నేటి నుండి నెల రోజుల పాటు నిర్వహించే ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రోగులకు 14 రకాల వైద్య పరీక్షలను 105 రకాల మందులను ఉచితంగా పంపిణీ చేస్తారన్నారు. క్యాంపులలో నిపుణులైన స్పెషలిస్టు డాక్టర్లు అందుబాటులో ఉంటారన్నారు. ఆరోగ్యశ్రీ పట్ల అవగాహన కలిగి ఉండి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవీయ కోణంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ప్రారంభిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆశా, ఎఎన్యం, గృహసారదులు, వాలంటీర్లు వైద్యాధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో విజయవంతం చేయాలని శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్ అన్నారు.జిల్లా కలెక్టర్ ఎస్ డెల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 304 వైద్య శిభిరాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. వీటిలో గ్రామీణ ప్రాంతాలలో 257, పట్టణ ప్రాంతాలలో 47 క్యాంపులను నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని వైద్య శిభిరాలు ఈనెల 30వ తేది నుండి నవంబర్ 9వ తేది వరకు అర్బన్ ప్రాంతాలలో అక్టోబర్ 5వ తేది నుండి నవంబర్ 16వ తేది వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. వైద్య శిబిరాలలో 111 మంది గైనిక్, జనరల్ మెడిసిన్ , నెఫ్రాలజీ, అర్థోపెడిక్, , ఈ ఎన్ టి విభాగాలకు చెందిన స్పెషలిస్ట్ డాక్టర్స్ అందుబాటులో ఉంటారన్నారు. ఆరోగ్య శిభిరాలలో ప్రతి ఒక్కరికి ఏడు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి కేసు స్టడీతో కూడిన హెల్త్ ప్రొఫైల్ తయారు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి మండలంలో ఎంపిడివోలు, పట్టణాల్లోని కమిషనర్లు, ఆశా, ఏ ఎన్ ఎం వైద్యాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో విజయవంతం చేయాలని ఆదేశించామన్నారు. ఇటీవల జి. కొండూరు మండలం కవులూరు గ్రామంలో ఫైలెట్ మెడికల్ క్యాంపులో కొన్ని లోటుపాట్లను గుర్తించామని వాటిని పరిగణలోకి తీసుకొని నేటి నుండి ప్రారంభమయే వైద్య శిబిరాలలో అటువంటివి జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకొని విజయవంతం చేసేలా ప్రణాళిక రూపొందించుకున్నామని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు.
కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డా.యం. సుహాసిని, ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్ జి. సుమన్, డిపిఎంవో డా. నవీన్ లు ఉన్నారు.
Prajavartha Online Telugu News