-అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుంది.
-జిల్లా కలెక్టర్ డా. కే.మాధవీ లత
– ఎంపీ మార్గాని భరత్ రామ్
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్క రంగంలో పనిచేసే వారి సమస్యలను తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత, ఎంపి మార్గాని భరత్ రామ్ లు పేర్కొన్నారు.శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన 5 వ విడత వైయస్ఆర్ వాహన మిత్ర నగదు బదిలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్, ఎంపి, జాయింట్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ విద్యానగర్ నుంచి జరిగిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో వాహన మిత్ర బ్యాంకు ఖాతాలకు సిఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి డిబిటి ద్వారా నగదు జమచేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఆటో, టాక్సీ, క్యాబ్, వాహన యాజమానుల మరియు డ్రైవర్లు ఖాతాలో వైయస్ఆర్ వాహన మిత్ర ఆర్థిక ప్రయోజనం పొందిన వారికి నా అభినందనలు తెలియ చేస్తున్నా అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్క రంగంలో ఉన్నా వారి కష్టాలు తెలుసుకుని, వారికి ఆర్థికంగా అండగా నిలిచి, వారి సమస్యలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. ప్రతి ఏడాది రూ .10 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించడం ద్వారా వాహన నిర్వహణ, బీమా ప్రీమియం , బ్రేక్ ఖర్చులు కోసం ఎటువంటి భారం లేకుండా చూడడం జరిగిందన్నారు. ఇటీవల సిఎం నిడదవోలు పర్యటన సమయంలో ఒక మహిళ తన భర్త ఆటో డ్రైవర్ అని, వాహన మిత్ర ద్వారా కలిగిన ప్రయోజనం వివరించి, ఈ సందర్భంగా వివరించారు. జిల్లా వ్యాప్తంగా 11,819 మంది ఆటో, క్యాబ్, ఓనర్లు, డ్రైవర్లు ఖాతాలో రూ.11.82 కోట్లు జమ చేసినట్లు తెలిపారు.అర్హత ఉండి విద్యుత్ బిల్లులు, ఆస్తుల అసెస్మెంట్, ఆధార్ సీడింగ్ సంబంధించి తప్పుగా జరిగితే వాటిని సరిచేసి, సంక్షేమ పథకాలను వర్తింప చేస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. అటువంటి సమస్యలను సచివాలయం ద్వారా అధికారుల దృష్టికి తీసుకుని రావాలని కోరారు.పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ దేశంలో మరెక్కడా లేని విధంగా “సొంత వాహనం కలిగి స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, ట్యాక్సి, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లు, ఎండియూ ఆపరేటర్లకు, ఇన్సూరెన్స్, “ఫిట్నెస్ సర్టిఫికెట్స్ తదితర అవసరాలకు అండగా నిలుస్తూ ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల రూపాయలను ఆర్థిక సాయంగా జగనన్న ప్రభుత్వం అందిస్తోందన్నారు. “వైఎస్సార్ వాహన మిత్ర” నేడు అందిస్తున్న రూ.275.93 కోట్లతో కలిపి ఇప్పటివరకు మన జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 1,301.89 కోట్లు అన్నారు. ఒక్కొక్క డ్రైవరన్నకు ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ 50 నెలల్లో రు.50 వేలు ఆర్థిక సాయం జమ చేశారన్నారు. తద్వారా”ఎండీయూ ఆపరేటర్లు, ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ అన్నదమ్ములకు తోడుగా ఉంటూ వారు సకాలంలో ఇన్సూరెన్స్, అవసరమైన రిపేర్లు చేయించుకునేందుకు, వారి వాహనాలను మంచి కండీషన్లో ఉంచుకునేందుకు. ఈ ఆర్థిక సాయం ఎంతో ఉపయుక్తం అయిందని పేర్కొన్నారు. వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర క్రింద రాష్ట్రంలో 2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 275.93 కోట్ల ఆర్థిక సాయం.. నేడు జమచేయడం జరిగిందన్నారు. మీ సమస్యల పట్ల అంకితభావంతో ఉన్నా జగనన్న కు మీరందరూ అండగా నిలవాలని భరత్ రామ్ కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి కె వి కృష్ణా రావు, రాజమండ్రి అర్బన్ కో ఆర్డినేటర్ డా గూడూరి శ్రీనివాస్, మాజీ రుడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి, ట్రాన్స్పోర్ట్ అధికారులు, పలువురు ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.లబ్ధిదారుల అభిప్రాయం:రాజమండ్రిఅర్బన్ చెందిన జోగా శ్రీనివాస్ రావు తన అభిప్రాయాన్ని వివరిస్తూ జగనన్న ప్రభుత్వం వొచ్చిన తరువాత ఆటో, టాక్సి, క్యాబ్ డ్రైవర్లు లకు ఎంతో మేలు చేకూర్చే విధంగా వైయస్ఆర్ వాహన మిత్రా పథకం అమలు చేస్తూ అండగా నిలిచారన్నారు. గత ప్రభుత్వాలు ఎప్పుడు మా కోసం ఎటువంటి పథకాలు అమలు చేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. గత 4 విడతలుగా వాహన మిత్ర నగదు జమ చేశారని, నేడు 5 వ విడత జమ చేస్తున్న జగనన్న కు మా డ్రైవర్లు తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని అన్నారు.మా చిన్న అబ్బాయికి అమ్మఒడి, పెద్ద అబ్బాయికి జగనన్న వసతి దీవెన, మా తల్లి కి పెన్షన్ పథకం ఇవ్వడం ద్వారా మా కుటుంబానికి ఆర్థికంగా ప్రయోజనం కలిగిందన్నారు.రాజమండ్రి నివాసి. మట్టపర్తి ధనరాజు మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లు యొక్క కష్టాలు తెలుసుకుని, మాకు ఆర్థిక సహాయం అందించి నిలబడేలా జగనన్న ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. ఆటో నడుపుకునే మాకు ఇన్సూరెన్స్, బ్రేక్ – ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడే వారమని అన్నారు. నేడు ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.10 వేలు చొప్పున గత 4 సంవత్సరాలుగా వైయస్ఆర్ వాహన మిత్రా ప్రయోజనం చేకూర్చడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటామన్నారు. మళ్ళీ మళ్ళీ మాకు అండగా నిలిచిన జగనన్న కే మా మద్దతు ఇస్తామని తెలిపారు.
Prajavartha Online Telugu News