రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమమునకు ఫోల్డర్ మరియు బ్యాగులు సరఫరా చేయుటకు ఆసక్తిగల ఏజెన్సీలనుంచి దరఖాస్తులను సమర్పించుటకు ఆహ్వనిస్తున్నట్లు డి ఏం హెచ్ ఓ డా కె. వేంకటేశ్వర రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశాల మేరకు జగనన్నఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో జరుగుతున్న ఆరోగ్య శిబిరాలకు వచ్చి వైద్య సేవలు పొందే ప్రజలకు కేసుసీట్,ఫోల్డర్ మరియు బ్యాగును అందించుటకు గాను అర్హత నియమాలు గల ఏజెన్సీలను నుండి దరఖాస్తులు సమర్పించవలసినదిగా జాయింట్ కలెక్టర్ తూర్పుగోదావరి జిల్లా వారు కోరుచున్నారు. ఆ మేరకు లక్ష చొప్పున రెండు రకాల ఫోల్డర్ మరియు బ్యాగులు సరఫరా చేయుటకు ఆసక్తిగల ఏజెన్సీలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారి కార్యాలయము, రాజవోలు రోడ్,కరెంట్ ఆఫీస్ దగ్గర, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ సమీపంలో, బొమ్మూరు, రాజమహేంద్రవరం రూరల్ వారి కార్యాలయాన్ని జె ఎ ఎస్ నోడల్ అధికారి ఫోన్ నంబర్ 8143119111 సంప్రదించి వివరాలు పొందాలని డి ఏం హెచ్ ఓ తెలియ చేశారు. పూర్తి చేసిన దరఖాస్తులు సెప్టెంబర్ 30 సాయత్రం 5 గం// వరకు స్వీకరించడం జరుగుతుంది. వివరములకు వెబ్సైట్ లో https://eastgodavari.ap.gov.in సంప్రదించ గలరు అని తెలియ చేశారు..
Prajavartha Online Telugu News