రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న ఆరోగ్య సురక్ష కింద తూర్పు గోదావరి జిల్లాలో సెప్టెంబర్ 30 న 16 చోట్ల జే ఏ సి మెడికల్ క్యాంపు లను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.పైలట్ ప్రాజెక్టు కింద రాజమహేంద్రవరం రూరల్ కాతేరు పిహెచ్ సి పరిధిలో గల కాతేరు-1,లో సెప్టెంబర్ 26 న వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు.రాజమహేంద్రవరం అర్బన్ యుపిహెచ్ సి పరిధిలో గల అద్దేపల్లి కాలనీ 28 సచివాలయం ప్రాంతంలోని వైద్య శిబిరాన్ని శనివారం కలెక్టర్ సందర్శించనున్నట్లు వైద్య అధికారులు తెలిపారు.ఈ నెల 30 వ తేదీ శనివారం నుంచి మండలాల వారీ ఆయా గ్రామాల్లో నిర్వహించే జగనన్న ఆరోగ్య సురక్ష ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది. అనపర్తి మండలం కూతుకులూరు పిహెచ్ సి పరిధిలో గల కుతుకులూరు-2, బిక్కవోలు పిహెచ్ సి పరిధిలో గల వూలపల్లి-1, చాగల్లు పిహెచ్ సి పరిధిలో గల చాగల్లు -2, దేవరపల్లి మండలం యాదవోలు పిహెచ్ సి పరిధిలో గల చిన్నాయగూడెం-1, గోపాలపురం మండలం అన్నాదేవరపేట పిహెచ్ సి పరిధిలో గల చిట్యాల-1,కడియం మండలం కడియపులంక పిహెచ్సి పరిధిలో గల దుళ్ల-1,కోరుకొండ మండలం కోరుకొండ పిహెచ్ సి పరిధిలో గల వెస్ట్ గోనగూడెం, కొవ్వూరు మండలం కొవ్వూరు పిహెచ్ సి పరిధిలో గల వాడపల్లి-1, నల్లజర్ల మండలం నల్లజర్ల పిహెచ్ సి పరిధిలో గల పుల్లలపాడు, నిడదవోలు మండలం మార్కొండపాడు పిహెచ్ సి పరిధిలో గల విజ్జెశ్వరం, పెరవలి మండలం కానూరు పిహెచ్ సి పరిధిలో గల కానూరు -1, రాజమహేంద్రవరం అర్బన్ యుపిహెచ్ సి పరిధిలో గల అద్దేపల్లి కాలనీ 28 సచివాలయం ప్రాంతం, రాజానగరం మండలం రాజానగరం పిహెచ్ సి పరిధిలో గల కానవరం, రంగంపేట మండలం రంగంపేట పిహెచ్ సి పరిధిలో గల రంగంపేట-2, సీతానగరం మండలం సీతానగరం పిహెచ్ సి పరిధిలో గల చిన్నకొండేపూడి-2, ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం పిహెచ్ సి పరిధిలో గల ఉండ్రాజవరం-1, నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టరు తెలియజేశారు.
Prajavartha Online Telugu News