Breaking News

ఘనంగా శ్రీశ్రీశ్రీ విఘ్నేశ్వర భక్త బృందం ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజామహెూత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశ్రీశ్రీ విఘ్నేశ్వర భక్త బృందం ఆధ్వర్యంలో స్థానిక సూర్యారావుపేటలో సూర్యనారాయణ వీధిలో శనివారం అన్నదానం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు డి. రవి తేజ మాట్లాడుతూ… గత 14 సంవత్స రాలుగా స్థానిక పెద్దలు, స్థానిక మహిళలు, సహకారంతో ఎంతో ఘనంగా ఈ వినాయక చవితి ఉత్సవ ములు చేస్తున్నామని, ప్రతిరోజు కుంకుమ పూజలు, గణపతి హెూమాలు నిర్వహిస్తున్నామని ఆదివారం 18 కేజీల లడ్డు పాట, జరుగుతుందని, అదే రోజు సాయంత్రం 5 గంటలకు నిమజ్జన కార్య క్రమం, మేళ తాళాలతో, కోలాటాలతో, అంగ రంగ వైభవంగా, దీపకాంతులతో, నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని, ఈ వేడుకలకు భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు. ఈ కార్యక్రమంకి సహకరిం చిన స్థానిక పెద్దలకు, పోలీస్ శాఖ వారికి, కృతజ్ఞతలు తెలుపు తున్నాను అన్నారు. ఈ కార్యక్రమం లో బాలాజీ, భగవాన్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *