-వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
-విజయవాడ తూర్పు నియోజకవర్గం
-బీ.సీ.విభాగం
-సమన్వయ కర్త
-రంగబాబు తాటికొండ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ కార్యాలయం నందు వారి ఆదేశాల మేరకు వారి సహకారంతో విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని గురునానక్ నగర్,, మరియు ఆటోనగర్,, మొగల్రాజపురం,పటమట స్టేట్ బ్యాంక్ బ్రాంచిల వారి సహకారంతో ఈ ప్రాంతాలలో నివశిస్తూ చేతివృత్తుల పై జీవనం సాగిస్తున్న వారికి విశ్వకర్మ యోజన పథకం అమలుకు క్రొత్త ఎకౌంటు తీయడం జరిగింది.బీ.సీ.విబాగం సమన్వకర్త తాటికొండ రంగబాబు మాట్లాడుతూ ఇదివరకు స్టేట్ బ్యాంక్ లో ఎకౌంటు ఉన్న కూడా తప్పనిసరిగా మరలా ఈ క్రొత్త ఎకౌంటు తీసుకోవడం ద్వారానే ఈ పదకానికి అర్హులవుతారని పాస్ బుక్ వచ్చాక వారి వారి వృత్తులలో ఐదు రోజుల ట్రైనింగ్ చేసిన వారికి ఒక సర్టిఫికేట్ ఇచ్చి పదిహేను వేల రూపాయలు ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు.ఈ ట్రైనింగ్ పీరియడ్ లో కూడా వారి కర్చుల నిమిత్తం రోజుకు ఐదు వందల రూపాయలు ఇస్తారని ,,మరియు ఈ సర్టిఫికేట్ ను ష్యూరిటీ గా పెటదటుకుని నాలుగు విడతలుగా కేవలం నలభై పైసలు వడ్డీకి అనగా మొదటి విడత లక్ష రూపాయలు,, రెండోవిడతగా రెండు లక్షలు,,మూడో విడత మూడు లక్షలు ,,నాలుగో సారి నాలుగు లక్షలు ఇస్తారని తెలియజేసారు.ఇదే కాక ఈ క్రొత్త ఎకౌంటు లు డిజిటల్ ట్రాన్సిషన్ చేసే వారి బ్యాంకు వారే ప్రతి నెల వంద రూపాయలు ప్రోత్సాహకంగా ఎకౌంటులో జమ చేస్తారని తెలియజేసారు.నియోజకవర్గంలో పేద మద్యతరగతి ప్రజల అభివృద్ధి ,మరియు జీవన ప్రమాణాలు పెరగటం కోసం ఇంతలా ఆలోచించి కార్యక్రమాలు నిర్వహిస్తున్న దేవినేని అవినాష్ కి దరకాస్తు చేసుకున్న అందరూ ధన్యవాదాలు,, కృతజ్ఞతలు తెలియజేసారు..ఏవిధమైన రాజ్యాంగ బద్దమైన పదవులలో లేకుండానే ఇంత చేస్తున్న అవినాష్కి కి రాబోయే రోజుల్లో మనం అండగా నిలబడి శాశనసభకు పంపాలని తెలియజేసారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సహకరించిన సంబంధిత బ్యాంకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసారు.విజయవాడ స్టేట్ బ్యాంక్ క్రెడిట్ చీఫ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ హాజరై పదకం అమలు పూర్తి వివరాలు తెలియజేసారు
Prajavartha Online Telugu News