Breaking News

కోర్టు ఆవరణలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మనం పనిచేసే ప్రాంతం, కార్యాలయాలను పరిశుభ్రత పాటించడం కోసం ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని 1 వ అదనపు జిల్లా న్యాయమూర్తి , ఇంఛార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి ఆర్ రాజీవ్ కోరారు.ఆదివారం ఉదయం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో స్వచ్చాతా హీ సేవా కార్యక్రమములో భాగంగా పరిశుభ్రత , పరిరక్షణ కార్యక్రమము నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంఛార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి ఆర్ రాజీవ్ మాట్లాడుతూ,ఆంధ్రప్రదేశ్ హై కోర్టు వారి ఆదేశాలు మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ల యందు ” స్వచ్చాతా హీ సేవా” కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని అన్నారు. న్యాయ మూర్తులు నుంచి కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, న్యాయ సేవాధికార కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వారి కార్యాలయాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అందుకోసం శానిటేషన్ సిబ్బంది తో కలిసి అడుగులు వేద్దాం అని కోరారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఈరోజున శ్రమదానం కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా భాగస్వామ్యం అవ్వాలని పిలుపు నిచ్చారు. బృందాలు గా ఏర్పడి మీ మీ కార్యాలయాల్లో ఇటువంటి కార్యక్రమాలు స్వచ్ఛంద భాగస్వామ్యం తో నిర్వర్తించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణ లో, కార్యాలయం లో పరిశుభ్రత పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమము లో రాజమహేంద్రవరం కు చెందిన 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి  ఏం. మాధురి , 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎమ్.నాగేశ్వర రావు, ఏసిబి కోర్టు న్యాయమూర్తి యూయూ ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి – డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కె. ప్రత్యూష కుమారి, పలువురు న్యాయ మూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పేరా లీగల్ వాలంటీర్లు, ఆర్ ఏం సి శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *