రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
నిత్య జీవన విధానం లో అభివృద్ధి తో పాటు పరిశుభ్రత కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పిలుపు నిచ్చారు. ఆదివారం ఉదయం స్వచ్ఛత హి సేవా కార్యక్రమం జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో లాలాచెర్వు జంక్షన్ నుండి దివన్ చెరువు గ్రామ పంచాయతీ లో ఆటో నగర్ వరకు హైవే పై , పుష్కర వనం పార్క్ దివన్ చెరువు (అటవీ శాఖ) శ్రమదానం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, డిపివో జేవి సత్యనారాయణ, ఎల్ డి ఎం డి వి ప్రసాద్, స్థానిక ప్రజా ప్రతినిధులు, శానిటేషన్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, దేశ ప్రధాని పిలుపు మేరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మునిసిపల్, గ్రామ పంచాయతీల పరిధిలో స్వచ్ఛత హీ సేవా – ఒకరోజు ఒక గంట కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం జరిగిందన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, కొవ్వూరు, నిడదవోలు మునిసిపల్ ఏరియాలో, అన్ని గ్రామాల్లో పరిశుభ్రత పరిరక్షణ కార్యక్రమాలను నిర్వహించు కుంటున్నట్లు తెలిపారు. నిత్య జీవనంలో అభివృద్ధి తోపాటు పరిసరాల పరిశుభ్రత కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అప్పుడే ప్రజలు ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యంగా జీవించడం సాధ్యం అవుతుందన్నారు. మనం ఎప్పుడైతే మన చుట్టూ ఉండే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకో గలుగుతామో, తద్వారా మన నగరం, గ్రామం జిల్లాలో కూడా పరిశుభ్రత పరిరక్షణ సాధ్యం అవుతుందని మాధవీలత పేర్కొన్నారు. నిన్నటి రోజున నగరంలో నిర్వహించుకున్న ఐ ఎస్ ఎల్ 2.0 కార్యక్రమం విజయవంతం కావడం జరిగిందని, అదే స్ఫూర్తి కొనసాగించడం జరగాలన్నారు. రాజానగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ , స్వచ్ఛత పై ప్రజల్లో అవగాహన కోసం జిల్లాలో స్వచ్ఛత హీ సేవా – ఒకరోజు ఒక గంట కార్యక్రమం నిర్వహించుకున్నా మని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఒక గంటకే పరిమితం కాకుండా నిత్య జీవితంలో ఒక భాగం కావాలన్నారు. సంక్షేమం, అభివృద్ధి తో పాటు పరిశుభ్రత కూడా ఎంతో కీలకం అన్నారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి దిశా నిర్దేశం లో జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు నిర్వహించ కుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రతిరోజూ ఒక గంట సమాజం లో పరిశుభ్రత పరిరక్షణ కోసం కార్యక్రమాలలో పాల్గొని, ఒక అలవాటుగా మార్చుకోవా లన్నారు.
Prajavartha Online Telugu News