Breaking News

పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు

-పాల్గొన్న సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధానమంత్రి  నరేంద్రమోడీ , రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి వారి ఆదేశాల మేరకు ” స్వచ్ఛత హీ సేవా ” కార్యక్రమాలలో ఉద్యోగులు భాగస్వామ్యం అవ్వడం అభినందనీయం అని సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక దేవిచౌక వద్ద పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవ – ఒకటవ తేదీన ఒక గంట పరిశుభ్రత పరిరక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రత పరిరక్షణ మనందరి వ్యక్తిగత బాధ్యత అని పేర్కొన్నారు. మనం పనిచేసే కార్యాలయాలలో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం అన్నారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్త్రేట్ డా.కె.మాధవీలత గారి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాల్లో పరిశుభ్రత పాటించడం లో ఉద్యోగులు పాల్గొనడం జరిగిందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పిలుపు నిచ్చారు. ఉదయం గం.10 ల నుండి గం.11 ల వరకు జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయ ఆవరణలో “స్వచ్చ భారత్” కార్యక్రమము జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డా.ఎస్.టి.జి.సత్యగోవింద్ సారధ్యంలో జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి వారి కార్యాలయ సిబ్బంది, డివిజనల్ కార్యాలయ సిబ్బంది మరియు ఏరియా పశువైద్య శాల సిబ్బంది యావన్మంది స్వచ్చందంగా పాల్గొనడం అభినందనీయం అన్నారు. ఈ స్వచ్చ భారత్ కార్యక్రమం ఈ ఒక్క రోజుతో ముగియకుండా నిరంతరం కొనసాగించి మన నివాస పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అనే సంకల్పం ద్వారా మన భావి తరాలకు మనమిచ్చే నిజమైన స్వచ్చ భారత్ అని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డా.ఎస్.టి.జి. సత్య గోవింద్ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ముందు రోజున “స్వచ్చ భారత్” నిర్వహించడమే కాకుండా ప్రతి 3వ లేదా నాల్గవ శనివారం నాడు కూడా పరిశుభ్రత పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కార్యాలయ ఆవరణలో గల చెత్త, వాడి పారేసిన ప్లాస్టిక్ వస్తువులు తదితర పనికిరాని మొక్కలు తీసేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా స్వచ్చ భారత్ లక్ష్యంగా అందరూ ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. తద్వారా పూజ్య బాపూజీ ఆశయాలను మన మందరం ముందుకు తీసుకు వెళ్ళడమే వారికి మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో డా.కె.సత్య నారాయణ, సహాయ సంచాలకులు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా.యోగానంద్, డా.లోకేష్, జిల్లా కార్యాలయ సూపరింటెండెంట్ భాస్కర కుమార్, డివిజనల్ కార్యాలయ సూపరింటెండెంట్ రాంబాబు, జూనియర్ అసిస్టెంట్  రాములు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *