-బాలల హక్కులపై అవగాహన కల్పించారు
-అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ
-డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కె. ప్రత్యూష కుమారి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ . కె. ప్రత్యూష కుమారి గోకవరం మండలం వీరలంకపల్లి గ్రామంలోని డా. బి.ఆర్. అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. బాలికలను వారికి అందుతున్న సదుపాయాలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి పాఠశాలలో కానీ, వసతి గృహములో కానీ ఎలాంటి సమస్యలున్నాయో అడిగి తెలుసుకున్నారు. బాల బాలికలకు ఉన్న హక్కుల గురించి, వివిధ చట్టాల గురించి అవగాహన కల్పించారు. పాఠశాల పరిసరాలు, టాయిలెట్లు, డార్మెటరీలు, భోజనశాలను పరిశీలించారు. పిల్లలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, వారి సంక్షేమం, పరిరక్షణ ఉపాధ్యాయులు, పర్యవేక్షకుల బాధ్యత అని తెలిపారు. విద్యార్ధులకు అందించవలసిన వసతులలో ఎలాంటి లోటు ఉండకూడదని, నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలన్నారు.
Prajavartha Online Telugu News