Breaking News

ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు షెడ్యూల్ ప్రకారం ప్రారంభించాలి

-ప్రజల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అమలు తీరుపై అవగాహన కల్పించాలి
-వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్షేత్ర స్థాయి అధికారులకు దిశా నిర్దేశం
-కలెక్టర్ కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత ఖరీఫ్ 2023-24 సీజన్ కు సంబందించి ఈ నెలలో కోతలు ప్రారంభం కానున్న దృష్ట్యా, ముందస్తు కార్యాచరణ ప్రణాళిక మేరకు అర్భికెల ను ప్రారంభించడం తో పాటు ధ్యానం కొనుగోలు సిద్దంగా ఉండాలని కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ విడిది కార్యాలయం నుంచి కలెక్టర్, కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు, సిబ్బందికి ధాన్యం సేకరణ, 33 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరుపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం 33 సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు నగదు బదలీ, నగదు రహిత విధానంలో అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు డిబిటి, నాన్ డిబిటి ద్వారా అందచేసిన పథకాలు పై అవగాహన కలుగ చెయ్యాల్సి ఉందన్నారు. జగనన్న సురక్ష ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం జరిగిందని, అదే విధంగా మరో సారి సచివాలయం వారీగా లబ్ధిదారులు, వారికి చేకూరిన ప్రయోజనం వివరాలు తెలియ చేసే కార్యక్రమాన్ని చెప్పట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆమేరకు సచివాలయం వారీగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. అక్టోబర్ నెలలో ఖరీఫ్ సీజన్ కోతలు ప్రారంభం కానున్న దృష్ట్యా 231 కొనుగోలు కేంద్రాల్లో మానవ వనరుల, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఖరీఫ్ సీజన్ కు సంబందించి ఇప్పటికే ఆర్భికేల వారీగా ఏమేరకు ధాన్యం కొనుగోలు చేయవలసి ఉంటుందో అంచనాలు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో 18 మండలాలు పరిధిలో 231 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అక్టోబర్ 16 నుంచి కోతలు వేగవంతం అవుతాయని, అందుకు అనుగుణంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు గన్నీ బ్యాగులు సిద్దం చేసుకోవాలి అని పేర్కొన్నారు. ఈ క్రాప్ నమోదు 98.69 %, ఈ కేవైసి 82.65% పూర్తి చేశారని, మిగిలిన లక్ష్యాలను సాధించడానికి అర్భికే, సచివాలయం వారిగా వ్యవసాయ సహాయకులు, రెవెన్యూ, పంచాయతి సిబ్బంది వివరాలు సేకరించి నూరు శాతం లక్ష్యాలను సాధించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సేకరణ ప్రక్రియ లో వినియోగించే వాహనాలకు జీ పి ఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా అనుసంధానం చేయడం పూర్తి చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ సహాయకులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సహాయకులు పోస్ట్ లను భర్తీ చేయాలని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *