Breaking News

రవళి స్పిన్నర్స్ విస్తరణ, మిల్లెట్స్ ప్రాసెస్ యూనిట్స్ లకు సీఎం జగన్ వర్చువల్ శంఖుస్థాపన

-పాల్గొన్న మంత్రులు సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వర రావు
-జిల్లాలో సంక్షేమ పథకాల తో పాటు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో తోడ్పాటు ఇవ్వడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.

పెరవలి, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో రవళి స్పిన్నింగ్ మిల్లు విస్తరణ, కోరుకొండ మండలంలో హై టెక్ ఫార్మా మిల్లెట్ ప్రొసెస్ యూనిట్స్ శంకుస్థాపన చేశారు.బుధవారం పెరవలి మండలం ఖండవిల్లి లోకి రవళి స్పిన్నర్స్ ఆవరణలో జరిగిన జిల్లా స్థాయి కార్యక్రమంలో జిల్లా ఇంచార్జీ మంత్రి సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ, హోం మంత్రి డా తానేటి వనిత, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు, జిల్లా కలెక్టర్ కె. మాధవీలత, ఎమ్మెల్సీ వంకా రవీంద్ర, నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస నాయుడు, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు చెందిన మూడు పరిశ్రమలకి శ్రీకారం చుట్టారని వాటిలో రూ.150 కోట్లతో ఖండవల్లి లో రవళి స్పిన్నింగ్ మిల్లు విస్తరణ శంఖుస్థాపన, కోరుకొండ మండలం కనుపూరు లో రూ.4.5 కోట్ల తో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు శంఖుస్థాపన చెయ్యగా, 3 ఎఫ్ ఆయిల్ పామ్ తో రూ.250 కోట్లతో అవగాహన ఒప్పద్దం చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన కు పెద్ద ఎత్తున ప్రోత్సహం ఇవ్వడం జరుగుతుందని, జిల్లాలో పరిశ్రమల స్థాపన కు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం తరపున అన్ని సహాయ సహకారాలు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలియ చేశారు. నూతన జిల్లా ఏర్పాటు చేసిన నాటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని విధాలుగా అండగా నిలిచినట్లు పేర్కొన్నారు. జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి చేసే దిశలో గ్రాసం ఇండస్ట్రిస్ విస్తరణ, అసాగో పరిశ్రమ శంఖుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా హజరవ్వడం జరిగిందని తెలిపారు. రూ.150 కోట్లతో విస్తరిస్తున్న రవళి ఇండస్ట్రీస్ ద్వారా 1000 మందికి ఉపాధి, రూ.4.5 కోట్ల తో నిర్మిస్తున్న ఫుడ్ ప్రాసెసంగ్ యూనిట్ ద్వారా 20 మందికి, 3 ఎఫ్ ఆయిల్ పామ్ ద్వారా 1000 మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు జిల్లా యంత్రాంగం తరపున అన్ని విధాలా సహయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉంటామని కలెక్టర్ మాధవీలత హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, రవళి పరిశ్రమ జాయింట్ ఎండి వంక రాజకుమారి, డైరెక్టర్ వంక రఘువీర్, ఆర్డీవో ఎస్ మల్లి బాబు, జిల్లా పరిశ్రమల అధికారి బి. వేంకటేశ్వర రావు, జిల్లా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అధికారి ఏ. స్వాతి, మండల తాసిల్దార్ టి రాజరాజేశ్వరి మండల పరిషత్ అధ్యక్షులు కార్చెర్ల సీతారామ ప్రసాద్ ఖండవల్లి సర్పంచ్ నాగరాజు ముక్కామల సర్పంచ్ కేతా త్రిమూర్తులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

సిఎం క్యాంపు కార్యాలయంలో :

గుంటూరు జిల్లా తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రవళి స్పిన్నింగ్ మిల్లు డైరెక్టర్ సింహాద్రి రఘువీర్ రవళి మాట్లాడుతూ రవళి స్పిన్నింగ్ మిల్లు ద్వారా 70 శాతం మంది స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. మహిళలు ఆధారితంగా రవళి పరిశ్రమ పనిచేస్తున్నట్లు, ఇక్కడ ఎక్కువ శాతం మహిళలే పనిచేస్తున్నట్లు తెలిపారు. సిఎం ఆశయాలకు అనుగుణంగా ఈ పరిశ్రమలో 70 శాతం మంది స్థానికులకే ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినట్లు తెలిపారు. స్పిన్నింగ్ మిల్లు విస్తరణ పూర్తి అయితే ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 500 మంది ఉపాధి అవకాశాలు కలుగుతాయని రవళి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *