-ఇప్పటి వరకు 3,35,614 గృహాల సందర్శన పూర్తి చేశారు
-టోకెన్ రిజిస్ట్రేషన్ మాడ్యుల్ పై సాంకేతిక శిక్షణ కల్పించాలి
-2వ దశ వాలంటీర్ లు ఇంటింటి సందర్శన పూర్తి చేయాలి
-కలెక్టర్ కె.మాధవీ లత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం సాయంత్రం సిఎం కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాల కొండయ్య జిల్లా కలెక్టర్ల తో జే ఏ ఎస్ పై సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టర్ విడిది కార్యాలయం నుంచి కలెక్టర్ మాధవీలత, డి ఎం హెచ్ వో డా కె. వేంకటేశ్వర రావు, డి సిహెచ్ ఎస్ డా ఎమ్. సనత్ కుమారి, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డా పి. ప్రియాంక, ఇతర వైద్య అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత జిలల్లా ప్రగతి వివరాలు తెలియ చేస్తూ, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా 356 గ్రామ వార్డు సచివాలయాలో జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే లో భాగంగా 4,46,233 ఇళ్లకు గాను 3,35,614 ఇళ్లను సందర్శించి 75.20 శాతం ఆరోగ్య డేటా సేకరించడం జరిగిందని, ఆమేరకు టోకెన్లు జారీ చేస్తున్నట్లు తెలిపారు. నూరుశాతం ఇంటింటి సందర్శన పూర్తి5చేయనున్నట్లు తెలిపారు. డేటా లో నమోదు కాకుండా జే ఏ ఎస్ శిబిరాలకు నేరుగా వచ్చే వారి వివరాలు టోకెన్ రిజిస్ట్రేషన్ కోసం రూపొందించిన మాడ్యులర్ లో నమోదు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా మండల స్థాయి అధికారులతో జే ఏ ఎస్ ప్రగతి, టోకెన్ జారీ, తదుపరి చికిత్స కోసం చేపడుతున్న చర్యల పై దిశా నిర్దేశనం చేశారు. మెడికల్ క్యాంపు నిర్వహించే 20 రోజుల ముందు మాత్రమే సాఫ్ట్వేర్ లో వివరాలు నమోదు చెయ్యడానికి అవకాశం ఉందని తెలిపారు. ఆమేరకు శిబిరం జరిగే రోజు నాటికి వాలంటీర్ రెండు సార్లు, ఆరోగ్య కార్యకర్త ఒకసారి ఇంటింటి సర్వే చేపట్టాలని స్పష్టం చేశారు. కొత్తగా జగనన్న ఆరోగ్య సురక్ష కోసం టోకెన్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్‌ను ప్రారంభించడం జరిగిందన్నారు. టోకెన్ రిజిస్ట్రేషన్ క్యాంపు రోజున తెరవ బడుతుందన్నారు. శిబిరానికి హాజరయ్యే ప్రతి పౌరుడికి శిబిరం ప్రవేశద్వారం వద్ద టోకెన్ ఇవ్వడం జరగాలని ఆదేశించారు. పౌరుడికి ఇచ్చిన టోకెన్‌ను తనిఖీ సమయంలో వైద్యులు సేకరించి రికార్డ్ చెయ్యాలని పేర్కొన్నారు. ఎంపీడీఓలు/మెడికల్ అధికారులందరూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Prajavartha Online Telugu News