కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఎక్కడా లేని విధంగా కుల,మత, పార్టీలకతీతంగా అర్హత ఉన్న పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. 138వ రోజైన గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని కొవ్వూరు మండలం ఐ. పంగిడిలో ఆదివారం నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి.. ఆయా వీధుల్లో నివాసాలన్నింటినీ తిరిగారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించారు. అన్ని ఇళ్లకు తిరుగుతూ కుటుంబాలను కలుసుకోవడంతో పాటు, వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతకం చేసిన బుక్ లెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు, అభిమానులు హారతులు ఇస్తూ హోంమంత్రి కి ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవిధంగా ప్రజలకు చేరుతున్నాయని ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను మనందరి ప్రభుత్వం లో అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలకు, జగనన్న ప్రభుత్వానికీ తేడాను గమనించాలని ఆమె కోరారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రం లో 99 శాతం పథకాలను మహిళల పేరుతోనే అందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News