కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
చాగల్లు మండలం మీనా నగరం గ్రామం పాతపేటకు చెందిన కొక్కిరిపాటి రాజేష్ తండ్రి భాస్కరరావుకు సీఎంఆర్ఎఫ్ క్రింద మూడు లక్షల రూపాయల లెటర్ ఆఫ్ క్రెడిట్ ను రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అందజేశారు. బాధితుడు రాజేష్ (వయసు 35) తన రెండు తుంట్లు సరిగా పనిచేయకపోవడంతో నడవలేని స్థితిలో గత ఆరు సంవత్సరాలుగా బాధపడుతున్నాడు. ఆయన భాస్కరరావు కొడుకు దీనస్థితిని హోంమంత్రి తానేటి వనిత దృష్టికి తీసుకురాగా.. వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3 లక్షల రూపాయల లెటర్ ఆఫ్ క్రెడిట్ ను అందించి అండగా నిలిచారు. ఈ సాయంతో రాజేష్ మెరుగైన ఆరోగ్యంతో మంచి జీవనాన్ని పొందాలని హోంమంత్రి ఆకాంక్షించారు. ఆదివారం పంగిడిలో నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ ధృవపత్రాని తండ్రి భాస్కర్ రావుకు హోంమంత్రి అందజేశారు.
Prajavartha Online Telugu News