Breaking News

ఇస్రో ఉద్యోగాల్లో ప్రవేశం కోసం కెరీర్ గైడెన్స్ ఉండాలి

-పాఠ్యాంశాల్లో అంతరిక్ష విజ్ఞానం చేర్చాలి :
– జెసి తేజ్ భరత్
-ఘనంగా ముగిసిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇస్రోలో ఉద్యోగాల్లో చేరడానికి అనువుగా కెరీర్ గైడెన్స్ రూపొందించడంతో పాటు అంతరిక్ష విజ్ఞానం గురించి విస్తృతంగా పాఠ్యాంశాల్లో చేర్చాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ అభిప్రాయపడ్డారు.ఆ దిశగా ఇస్రో కృషి చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.ఈనెల 6వ తేదీ నుంచి స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో నిర్వహిస్తున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ఆదివారం సాయంత్రంతో ఘనంగా ముగిసాయి. ముగింపు సభకు గౌరవ అతిధిగా విచ్చేసిన జెసి తేజ్ భరత్ మాట్లాడుతూ ఈ ఆధునిక కాలంలో సౌకర్యవంతమైన జీవనం సాగిస్తున్నామంటే అందుకు ఇస్రో పరిశోధనలు, ప్రయోగాలు కారణమని పేర్కొన్నారు. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్, టివి, జాతీయ విపత్తుల గురించి ముందుగా తెలుసుకోవడం వంటివన్నీ ఇస్రో పరిశోధనల ఫలితమేనని ఆయన వివరించారు. అంతరిక్షంలో అగ్రగామిగా ఉంటేనే భవిష్యత్తులో సూపర్ పవర్ గా ఎదగవచ్చని జెసి తేజ్ భరత్ అన్నారు. అందుకే చైనా, రష్యా, అమెరికా వంటి దేశాలతో ఇస్రో పోటీ పడుతోందన్నారు. రాజమండ్రిలో అంతరిక్ష వారోత్సవాలు విజవంతం చేయడంలో కృషిచేసిన అందరికీ ఆయన అభినందనలు తెలిపారు.జిల్లా ఎస్పీ పి జగదీశ్ మాట్లాడుతూ
విద్యార్థులు భవిష్యత్ శాస్త్రవేత్తలుగా ఎదగాలి చంద్రయాన్, ఆదిత్య ఎల్1 వంటి ప్రయోగాలతో ఇస్రో అద్భుత విజయాలను నమోదు చేసిందన్నారు.
ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను రాజమండ్రిలో నిర్వహించి స్కూల్ విద్యార్థులను ఆహ్వానించి అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. వేలాదిమంది ఇక్కడకు వచ్చి తిలకించిన నేపథ్యంలో ఇందులో ఒక శాతమైనా ఇస్రో శాస్త్రవేత్తలుగా వెళ్లాలని ఆయన ఆకాంక్షిస్తూ, విక్రమ్ సారాభాయి, సతీష్ ధావన్, యు ఆర్ రావు వంటి మేటి శాస్త్రవేత్తలుగా మన విద్యార్థులు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.  అంతరిక్ష విజ్ఞానం భవిష్యత్ తరాలకు చేరువ చేయడమే లక్ష్యం : డిడి సునీల్ శ్రీహరికోట షార్ డిప్యూటీ డైరెక్టర్ పి సునీల్ మాట్లాడుతూ గడిచిన 60ఏళ్లలో ఎన్నోప్రయోగాలు చేసి విజయాలను నమోదుచేసున్న ఇస్రో భవిష్యత్తులో హ్యూమన్ మిషన్, గగన్ యాన్, చంద్రయాన్ 4, 5,6 వంటివి ప్రయోగించాల్సి ఉందని, అందుకే భవిష్యత్ తరాలకు అంతరిక్ష విజ్ఞానాన్ని చేరువ చేస్తున్నామన్నారు. అక్టోబర్ 4నుంచి 10వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ప్రతియేటా ఒక అంశంతో నిర్వహిస్తూ వస్తున్నామని, ఈ ఏడాది ‘ స్పేస్ అండ్ ఎంట్రప్రెన్యూర్ షిప్’ పేరిట నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ పేరిట సొంతంగా ప్రయోగాలు చేస్తున్న ఇస్రో 2047 నాటికి సాధించాల్సిన విజయాలను నిర్దేశించుకుని లక్ష్య సాధనకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఆర్జేడీ సిహెచ్ కృష్ణ మాట్లాడుతూ ఇస్రో సాధిస్తున్న విజయాలను వివరిస్తూ భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు నమోదు చేసుకోవాలన్నారు.  శ్రీహరికోట షార్ ఎల్ఎస్ఎస్ఎఫ్ జనరల్ మేనేజర్, ఉత్సవాల ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఎన్. విజయకుమార్ స్వాగతోపన్యాసం చేస్తూ, ఈ మూడు రోజుల్లో దాదాపు 25వేలమందికి పైగా విద్యార్థులు సందర్శించారని చెప్పారు. స్పేస్ వాక్ మొదలుకుని ఉత్సవాల నిర్వహణకు సహకరించిన ప్రతిఒక్కరికీ అయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. అతిధులను ఇస్రో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. అలాగే ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులను కూడా సత్కరించారు. రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టి కె విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ మిగిలిన చోట్ల ఇంజనీరింగ్ కాలేజీల్లో అంతరిక్ష వారోత్సవాలు నిర్వహిస్తే , దేశంలోనే మొదటిసారిగా ప్రజల మధ్య రాజమండ్రిలో అంతరిక్ష వారోత్సవాలు నిర్వహించడం అవి పూర్తిస్థాయిలో విజయవంతం కావడం ఆనందదాయకమన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలను ఇతర ఆర్గనైజింగ్ కమిటీ పక్షాన అతిధుల చేతుల మీదుగా సత్కరించారు. డిప్యూటీ డీఈవో నారాయణ, డిప్యూటీ ఐనస్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ దిలీప్ కుమార్, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత బాలాత్రిపుర సుందరి, అక్షర శ్రీ స్కూల్ డైరెక్టర్ టి నాగరత్నం, ప్రయివేట్ స్కూల్స్ మేనేజ్ మెంట్స్ అసోసియేషన్ నాయకులు పురెడ్ల కళ్యాణ్ రెడ్డి, రవిచంద్ర, ఏ రమేష్, పి. సురేష్, పి శివాజీ, ప్రగతి మురళి, జస్వర్ స్కూల్ రమేష్, పి గంగాధరరావు, డివి స్వామిరెడ్డి, ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు మండెల శ్రీరామ్మూర్తి, అధ్యక్షులు కె పార్ధసారధి, తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తదితర ప్రముఖులు ఉదయం నుంచి వేలాదిమంది విద్యార్థులు ప్రదర్శనను తిలకించారు. కళాకేంద్రం లోపల స్క్రీన్ మీద చంద్రయాన్ తయారీ, ప్రయోగం విజయవంతం దృశ్యాలను అలాగే అంతరిక్ష వారోత్సవాల టీజర్, 5వ తేదీ నుంచి నిర్వహించిన కార్యక్రమాల వీడియో ప్రదర్శించారు. చివరి రోజున కూడా విద్యార్థులకు ప్రశ్నలు వేసి, సమాధానాలు ఇచ్చినవారికి అక్కడికక్కడే బహుమతులు అందించారు. ముగింపు సందర్బంగా అతిధులు, ఆర్గనైజింగ్ కమిటీ, ఇస్రో శాస్త్రవేత్తలు గ్రూప్ ఫోటో దిగి, జనగణమన తో కార్యక్రమానికి ముగింపు పలికారు. ఇస్రో ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన ప్రదర్శనను ప్రతి ఒక్కరు తిలకించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *