Breaking News

పేదలకు మంచి జరగాలంటే జగనన్నే మళ్లీ సీఎం కావాలి

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు మంచి జరగాలన్నా., ప్రజల భవిష్యత్తు బాగుండాలన్నా జగనన్నే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రశాంతినగర్లోని అగ్రిగోల్డ్ కళ్యాణ మండపం నందు ‘ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి’ అనే కార్యక్రమంపై ఆదివారం పార్టీ శ్రేణులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు కడవకొల్లు నరసింహారావు, వైసీపీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం అక్టోబర్ 11 నుంచి నవంబర్ 11 తేదీ వరకు నెలరోజులపాటు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమ విజయవంతానికి గానూ ముందస్తుగా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనిలో భాగంగా సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు నేరుగా ప్రజల ఇళ్లకు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించాలని తెలిపారు. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై తేడాల్ని ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించారు. 2014లో 600 కి పైగా హామీలను గుప్పించి మేనిఫెస్టోను మాయం చేసిన చంద్రబాబు.. 2024 ఎన్నికల్లో మళ్లీ బూటకపు హామీలతో తయారయ్యారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి’ కార్యక్రమంలో భాగంగా ‘ఆపుబాబు నీ బూటకం – జగనన్నే మా నమ్మకం’ అనే అంశంపై విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరం
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్య, గృహ నిర్మాణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని మల్లాది విష్ణు తెలిపారు. ప్రజావసరాలను తీర్చడమే లక్ష్యంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన పథకాలను పార్టీలు, వర్గాలు, మతాలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ అందజేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి తప్పక అవసరమన్నారు. ముఖ్యంగా కోవిద్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం, వైద్య సేవలు అందించిన తీరు ప్రశంసనీయమన్నారు. పేదరికాన్ని పారద్రోలడం కోసం డీబీటీ ద్వారా అక్షరాల రెండున్నర లక్షల కోట్ల రూపాయల నిధులను వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలోని నిరుపేదల ఖాతాలలో నేరుగా జమ చేసినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 33,940 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 88 కోట్ల 64 లక్షలు., సున్నావడ్డీ పథకం ద్వారా 42,760 మందికి రూ. 17 కోట్ల 26 లక్షలు., వైఎస్సార్ చేయూత ద్వారా 10,875 మందికి రూ. 43 కోట్ల 38 లక్షలు., అమ్మఒడి పథకం ద్వారా 28,834 మంది తల్లులకు రూ. 118 కోట్ల 98 లక్షలు., వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 2,583 మందికి రూ. 12 కోట్లు., ఈబీసీ నేస్తం ద్వారా 2,593 మందికి రూ. 6 కోట్ల 81 లక్షలు నేరుగా ఆడపడుచుల ఖాతాలలో జమ చేసినట్లు వివరించారు. మొత్తంగా నాలుగేళ్లలో 1,37,244 మంది లబ్ధిదారులకు రూ. 339.32 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వివరించారు. ఇటువంటి సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని తెలియజేశారు. ఈసారి ఎన్నికలలో వైఎస్సార్ సీపీ మొదటి విజయం సెంట్రల్ నియోజకవర్గం నుంచే మొదలు కాబోతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జిలు, కోఆర్డినేటర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *