– ‘నా భూమి-నా దేశం’ లో పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు.
-రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది.
-ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా ఉన్నంత శిఖరాలను అధిరోహించాలి.
-జిల్లా కలెక్టర్ మాధవీలత.
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంతప్రాధాన్యత నిస్తుందని, ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా ఉన్నంత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత విద్యార్థులకు సూచించారు. అజాదీకా అమృత్ మహోత్సవ్, “నా మట్టి నా దేశం” కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ మాధవీలత శుక్రవారం స్థానిక లాలచెరువు మున్సిపల్ ఉన్నంత పాఠశాలలో విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో ప్రోత్సహాన్ని అందిస్తూ పాఠశాలలను ఆధునీకరిస్తూ, మౌలికసదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి చిన్నారి చదువుకోవాలని వారి విద్యకు అయ్యే ఖర్చు వారి ఫెరెంట్స్ మీద పడకూడదనే లక్ష్యం తో ప్రభుత్వం అమ్మఒడి ని అందిస్తూ, మరో వైపు పౌష్టికాహారంగా మధ్యాహ్నం భోజనంగా జగనన్న గోరు ముద్ద పథకాన్ని ప్రభుత్వ అమలు చేస్తుందన్నారు. పాఠశాల విద్య పూర్తవ్వగానే ఇంటర్ లో జగనన్న విద్య దీవెన, వసతి దీవెన ప్రభుత్వం అందిస్తున్నా మన్నారు. ఉద్యోగం రావాలంటే బయట పోటీ తత్త్వం ఎక్కువుగా ఉన్నందున డిగ్రీ లోనే ఆయా కోర్సులతో పాటు జీవనోపాధికి అవసరమైన నైపుణ్యాభివృద్ది శిక్షణను అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రోత్సహాన్ని ఇస్తూ అనేక స్కీమ్స్ అమలు చేస్తుంటే మనం ఏమి చెయ్యాలి… కచ్చితంగా మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే విధంగా బాగా చదుకోవాలి అని కలెక్టర్ మాధవీలత విద్యార్థులకు సూచించారు. మన విద్యే మనకు ఆస్తి విద్యా వున్నవారు సమాజంలో మోసపోయేందుకు అవకాశం లేదన్నారు. చక్కగా చదువుకొని మీ భవిష్యత్ మీరే పునాదులు వేసుకోవాలన్నారు. అందుకు మీ టీచర్స్ చక్కని విద్యాబోధన అందిస్తున్నారని, ఇటువంటి అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్వాతంత్రోద్యమంలో దేశం కోసం త్యాగం చేసిన త్యాగధనుల స్ఫూర్తిని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనపై ఉందని కలెక్టర్ మాధవీలత విద్యార్థులకు సూచించారు. స్వచ్ఛమైన మట్టి, గాలి సమగ్ర అభివృద్ధిని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ‘నా భూమి- నా దేశం’ కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నా మన్నారు. మన భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలయిన తరువాత మన భారత దేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ తొలుత జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్ర, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మేరీ మట్టి మేరీ దేశ్ కార్యక్రమం లో భాగంగా విద్యార్థులు… ప్రతిజ్ఞ చేశారు. “భారతదేశ సమగ్ర అభివృద్ధికి నావంతు కృషి నేను చేస్తాని, మనదేశ సాంస్కృతిక వారసత్వ సంపదని పరిరక్షిస్తానని దేశ సమగ్రతకు, ఐక్యమత్యమునకు సర్వదా పాటు పడతానని నాదేశం పట్ల నేను నిర్వర్తించవలసిన విధులను మరియు బాధ్యతలను నిర్వర్తిస్తానని దేశం కోసం త్యాగం చేసిన త్యాగధనులను ప్రేరణకు దేశరక్షణ మరియు దేశపురోగతికి నేను పునరంకితమవుతామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డి ఈ ఒ ఎస్. అబ్రహం, ఎంఈఒ, ఉపాధ్యాయులు, విద్యార్థులు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News