Breaking News

శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్. కె. ప్రత్యూష కుమారి జిల్లా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్. కె. ప్రత్యూష కుమారి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు ట్రాన్స్ జెండర్ల హక్కుల పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో న్యాయమూర్తి ప్రత్యూష కుమారి మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లకు భారత రాజ్యాంగం ద్వారా మరియు గౌరవ సుప్రీం కోర్టు వారి ఆదేశాల ద్వారా వారికి అందించబడిన హక్కుల గురించి వివరించారు. వారి హక్కు లను వినియోగించున్నప్పుడే సామాజికంగా వారు బలపడ తారని అన్నారు. వారి స్వయం ఉపాధి కోసం అందుబాటులో ఉన్న సబ్సిడీల గురించి వారికి వివరించారు. వారికి ఎలాంటి న్యాయ సమస్యలు ఉన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. ఈ సదస్సులో డి. ఎం. హెచ్. ఓ. అధికారులు డా. పి. లక్ష్మీ దేవి, డా. బి. రవి కుమార్, డా. ఆర్. మల్లిఖార్జున రావు, వివిధ ఎన్.జీ.ఓ ల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *