Breaking News

“ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం” జిల్లాకు చెందిన నిరుపేద కుటుంబములకు చెంది, 18 సంవత్సరములు నిండిన మహిళలకు ఉచితముగా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
“ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం” జిల్లాకు చెందిన నిరుపేద కుటుంబములకు చెంది, 18 సంవత్సరములు నిండిన మహిళలకు ఉచితముగా వంట గ్యాస్ కనెక్షన్లు అందజేయాడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లో “ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం” పై పౌర సరఫరాల అధికారుల ఆధ్వర్యంలో కమిటీ సమావేశం నిర్వహించారు. ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఏర్పాటు చేసి ఉన్నది. ఈ పథకం క్రింద ఇప్పటివరకూ ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లాలో 12704 మంది లబ్దిదారులు ఉన్నారు. ఈ పథకం ద్వారా మరిన్ని కనెక్షన్లు అందజేయు ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం వారు అదనంగా గ్యాస్ కనెక్షన్లు కేటాయింపు జేయుట జరిగినదన్నారు . ప్రజల్లో అవగాహన కలుగచెయ్యాలని ఆదేశించడం జరిగింది. 18 సంవత్సరములు నిండిన అనగా మహిళలు మాత్రమే అర్హులు గా పేర్కొన్నారు. కనెక్షన్ పొందగోరు వారి కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికీ ఇదివరకే గ్యాస్ కనెక్షన్ ఉండరాదని తెలియ చేశారు .ఈ పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందే సమయంలో లబ్దిదా రులకు రూ.4,093/-ల విలువకు కొత్త గ్యాస్ స్టవ్, గ్యాస్ తో నింపిన నిండు సిలిండర్, రెగ్యులేటర్, సురక్షా ట్యూబ్, గ్యాస్ నమోదు పుస్తకం, సెక్యురిటీ డిపాజిట్ లతో పాటుగా లబ్దిదారునికి అన్నీ ఉచితంగా అందచేస్తున్నట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు .ఈ పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందుటకు కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు, రైస్ కార్డులతో మీ సమీప గ్యాస్ ఏజన్సీ వారిని సంప్రదించి దరఖాస్తు చేసుకొనవలెను. ఈ అవకాశమును అందరూ సద్వినియోగం చేసుకొన వలసినదిగా కొరియున్నారు. సదరు సమావేశమునకు జిల్లా పౌర సరఫరాల అధికారి పి . విజయ భాస్కర్, BPCL సేల్స్ ఆఫీసర్,(మెంబర్ కో-ఆర్డినేటర్), HPCL సేల్స్ ఆఫీసర్(మెంబర్) తదితరులు హజరైనారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *