-మూడు ప్రధాన పరికరాలు అనుసంధానం లో ఓటింగ్ ప్రక్రియ
-బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి ప్యాట్
-ఈ వి ఎం యూనిట్స్ ఏ ఒక్కటి అంతర్జాలంతో అనుసంధానం కావు
-బెల్ ఆధ్వర్యంలో ఈవిఎం యూనిట్స్ మొదటి దశ అంగీకార తనిఖీలు
-సహాయకారి విధులు రెవెన్యూ అధికారులు సిబ్బంది నిర్వర్తించాలి
-అక్టోబర్ 16 నుంచి సుమారు 25 రోజులు వరకు తనిఖీలు
-ఉదయం 9 నుంచి సాయంత్రం 7 వరకు
-విధులు నుంచి ఎటువంటి మినహాయింపులు ఉండవు
– కలెక్టర్ కె. మాధవీలత
– జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల ప్రక్రియలో మొదటి దశ తనిఖీ ఎంతో కీలకం అని అందుకు అనుగుణంగా రెండవదశ తనిఖీ, తదుపరి ఓటింగ్ ప్రక్రియ ఆధారపడి వుంటుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయం లో ఈవీఎంల మొదటి స్థాయి శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్, సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కే. మాధవీలత మాట్లాడుతూ, ఎఫ్ ఎల్ సి తనిఖీ చేసే ప్రక్రియను పూర్తిగా వెబ్ కాస్టింగ్ లో రికార్డ్ చెయ్యడం జరుగుతుందని అన్నారు. తనిఖీల కోసం 140 మంది సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. ఏ ఒక్కరికీ విధుల్లో మినహాయింపు లేదని స్పష్టం చేశారు. తనిఖీ చేసే కేంద్రం లోకి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో నిర్వహిస్తామన్నారు. ప్రతి ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు యూనిట్స్ తనిఖీ ప్రక్రియ ఉంటుందని అన్నారు. మొదటి దశ అంగీకార పరీక్ష లో యూనిట్స్ బెల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, విధుల నుంచి ఎటువంటి మినహాయింపు లేదని స్పష్టం చేశారు. మొత్తం 140 సిబ్బందిని 20 టీమ్స్ గా నియమించామని , ఒకొక్క బృందం లో 6 చొప్పున, మిగిలిన 20 మంది రిజర్వ్ లో ఉంచడం జరుగుతుందని అన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులను ఈ తనిఖీల్లో తప్పని సరిగా హాజరు కావాలని, ఆమేరకు పర్యవేక్షణ అవసరం అన్నారు. జాయింట్ కలెక్టర్ మొత్తం పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించామని, రెవెన్యూ డివిజన్ అధికారిని కూడా పర్యేక్షించడానికి నియమించినట్లు మాధవీలత తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టి, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల ప్రక్రియలో అత్యంత పారదర్శకంగా చేపట్టే దిశలో వివిధ దశల్లో ఈ వి ఎం పరికరాలను అధీకృత బెల్ ఇంజనీర్ల దిశా నిర్దేశం లో తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్, వివి ప్యాట్ (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయిల్) లని తనిఖీ చేసి, వాటి పనితీరు తదితర అంశాలను ధ్రువీకరించడం జరుగుతుందని అన్నారు. జిల్లాకు 5500 బ్యాలెట్ యూనిట్స్, 6000 కంట్రోల్ యూనిట్, 4950 వివిపాట్స్ రావడం జరిగిందన్నారు. జిల్లాను కొత్తగా ఏర్పాటు చేసినందున నూతన ఓటింగ్ పరికరాలు వచ్చాయన్నారు. అందుచేత యూనిట్స్ తనిఖీ సులభతరం చేస్తుందన్నారు. ఈ తనిఖీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు తప్పకుండా హాజరు కావాలని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయం నుంచి సి ఈ ఓ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష : ఎఫ్ ఎల్ సి పై రాష్ట్ర ప్రథాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా సూచనలు చేస్తూ, తనిఖీ ప్రక్రియను అత్యంత జాగ్రతగా నిర్వహించాలన్నారు. తనిఖీ చేసే కేంద్రాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తూ, ప్రతి రోజూ పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారని, ఇందుకోసం ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఆమేరకు పూర్తి స్థాయి ఏర్పాటు చేసి, జాయింట్ కలెక్టర్, ఆర్డీవో రాజమహేంద్రవరం లను పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించామని కలెక్టర్ మాధవీలత తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, ఆర్డీవో లు ఎస్. మల్లిబాబు , ఏ . చైత్ర వర్షిణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తెం రాజు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News