Breaking News

దివ్యాంగులకు సేవ చేయడం భగవంతుని సేవించడమే

-దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన కేంద్రమంత్రి, ఎంపీ, జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
దివ్యాంగులకు సేవ చేయడం భగవంతుని సేవించడమేనని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఏ. నారాయణస్వామి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని Artificial Limbs and manufacturing Corporation of India(ALIMCO) సంస్థ ద్వారా దివ్యాంగులకు, వయోవృద్ధులకు అవసరమైన ఉపకరణాలు పంపిణీ కొరకు ఏర్పాటుచేసిన సామాజిక సాధికారత శిబిరం మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి అధ్యక్షతన జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని 420 మంది దివ్యాంగులకు రు.46.97 లక్షల విలువైన ట్రై సైకిళ్లు, వీల్ చైర్స్, వినికిడి పరికరాలు, బ్రెయిలీ కిట్స్, కృత్రిమ అవయవాలు తదితర పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని అన్నారు. ఇందులో భాగంగా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు పట్ల పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలసౌరి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు లకు కేంద్ర మంత్రి అభినందనలు తెలియజేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో దివ్యాంగులు 1,35,000 మంది ఉన్నారని, ఇంత ఎక్కువ మంది దివ్యాంగులు ఉండడం కేంద్రమంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో దివ్యాంగులు పుట్టడానికి లేదా ప్రమాదాలకు కారణాలు విశ్లేషించాలని అన్నారు. దివ్యాంగులుగా పుట్టడం వారు చేసిన పాపం కారణం కాదని అన్నారు. మన జీవన విధానం, త్రాగే నీరు, అనారోగ్య పరిస్థితుల్లో డాక్టర్లు ఇచ్చిన మందులు తదితర కారణాలు కావచ్చు అన్నారు. విశ్వకర్మ యోజన పథకం క్రింద చేతివృత్తుల వారు ఆర్థిక సహాయం పొంది జీవన స్థితిగతులను మెరుగుపరచుకోవాలన్నారు దివ్యాంగులు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడిన గ్రూపులకు కేంద్రం నాలుగు శాతం వడ్డీకే రుణాలు మంజూరు చేస్తున్నదని, ఈ పథకం సద్వినియోగం చేసుకోవాలని దివ్యాంగులను కోరారు. వినికిడి లోపం గల వారికి ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తున్నట్లు తెలిపారు దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేస్తున్నద న్నారు. జల జీవన్ మిషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తున్నదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని పెద్ద ఎత్తున సద్వినియోగం చేసు కుంటున్న్నందుకు అభినందనలు తెలిపారు. బందరు పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ పుట్టుకతోనే కొంతమంది, అనుకోకుండా జరిగే ప్రమాదాల వల్ల మరి కొంతమంది దివ్యాంగులుగా మారతారని అన్నారు సమాజంలో దివ్యాంగులకు వారి వారి అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా సహాయ పరికరాలు అందించడం నిజమైన ప్రజా ప్రతినిధులు అధికారులు అనిపించుకుంటారని అన్నారు. దివ్యాంగులలో ప్రమాదంలో కాలు కోల్పోయిన సుధా చంద్రన్ కఠిన శిక్షణతో గొప్ప నృత్య కారిణిగా, అందుడైన ద్వారం వెంకటస్వామి నాయుడు గొప్ప వయోలిన్ విద్వాంసుడిగా, పుట్టుకతో కేవలం రెండే అడుగులు గల నికోలస్ జేమ్స్ ప్రపంచవ్యాప్తంగా మోటివేషన్ స్పీచెస్ ఇస్తున్నారని, కాళ్లు చేతులు పడిపోయి వీల్ చేరికే పరిమితమైన స్టీఫెన్ హాక్ గొప్ప ప్రపంచ మేధావిగా ఎదిగారని, దివ్యాంగులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. కృష్ణ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎస్సీ హాస్టల్ ఏర్పాటుకు 12 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరగా, ఈ మేరకు నిధులు మంజూరు చేయుటకు మంత్రి హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలో 2011 సెన్సెస్ ప్రకారం 1,35,000 మంది దివ్యాంగులు ఉన్నారని అన్నారు. 2022 -23 సంవత్సరంలో కృష్ణజిల్లాలో దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా 481 మంది లబ్ధిదారులకు 30 లక్షల విలువైన ఉపకరణాలు, 2023- 24 సంవత్సరం 172 మంది లబ్ధిదారులకు 77 లక్షల విలువైన ఉపకరణాలు అందించినట్లు తెలిపారు. జిల్లాలో 32 వేల మంది దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల 3 వేల రూపాయల చొప్పున పింఛన్లు అందజేస్తున్న విషయం గుర్తు చేశారు. ఎంపీ గారి చొరవతో 2021 డిసెంబర్ 17 నుండి 30 వరకు మరియు 2022 జనవరిలో దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు అందజేయడం కొరకు గుర్తింపు శిబిరాలు నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు ఈ శిబిరాల్లో 2717మంది విభిన్న ప్రతిభావంతులకు రూ. 5.05 కోట్లు విలువచేసే ఉపకరణాలు అందించాలని ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ శిబిరాల్లో గుర్తించిన 420 మందికి రు.46.97 లక్షలు విలువచేసే ఉపకరణాలు ఈరోజు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బందర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి నిధులు తేవడంలో విశేష కృషి చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా జిల్లాకు సిఎస్ఆర్ ఫండ్స్ ఎక్కువ మొత్తంలో తెచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులను కలెక్టర్ అభినందించారు. అదేవిధంగా జిల్లాలో దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్న కేంద్ర మంత్రివర్యులకు పార్లమెంట్ సభ్యునికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ALIMCO డీజీఎం సంజయ్ సింగ్, డిఆర్వో పి వెంకటరమణ జడ్పీ సీఈవో జ్యోతి బసు, ఆర్డీవో ఇన్చార్జ్ బి శివ నారాయణ రెడ్డి, జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి రామరాజు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *