విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మవారిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియా పాయింట్లో ఆమె మాట్లాడుతూ దసరా అంటే మహిళల పండుగ అని అభివర్ణించారు. రాష్ట్రంలోని మహిళలందరూ తమ తమ కుటుంబాలతో జీవించాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలన దిగ్విజయంగా కొనసాగాలని తన కోరికను అమ్మవారికి చెప్పానన్నారు. భక్తుల కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.
Tags vijayawada
Check Also
చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …
Prajavartha Online Telugu News