Breaking News

జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా జిల్లాలో ఒక లక్ష 410 మంది ప్రజలు వైద్య సేవలు పొందడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్ .ఢిల్లీ రావు అన్నారు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఇప్పటివరకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహణలో భాగంగా జగనన్న ఆరోగ్య శిబిరాలు గ్రామీణ ప్రాంతాల్లో 168 ,పట్టణ ప్రాంతాల్లో 19 కలిసి మెత్తం 187 శిబిరాలు లో 1,00,410 మంది ప్రజలు పాల్గొని వైద్య సేవలు పొందారని జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్  ఎస్ డీల్లీరావు గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సంబంధిత గౌరవ శాసనసభ్యులు,మండల అధ్యక్షులు, మున్సిపల్ ఛైర్మన్ లు,జిల్లా ప్రజాపరిషత్ సభ్యులు,మండల‌ ప్రజాపరిషత్ సభ్యులు, సర్పంచ్ లు,వార్డు సభ్యులు, కార్పొరేటర్ లు,ప్రజలు పాల్గొనడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత సెప్టెంబర్ నెల 30వ తేదీ నుండి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా మెగా వైద్య ఆరోగ్య శిబిరాలను సమర్దవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో గత సెప్టెంబర్ నెల 30వ తేదీ నుండి ఈనెల 13 వ తేదీ వరకు నిర్వహించిన 187 వైద్య శిబిరాలకు 1,00,410 మంది ప్రజలు హాజరుకాగా అందులో 48,645 మంది పురుషులు, 51,835 మంది మహిళలు వైద్య సేవలు పొంది 95,794 మంది ఉచిత మందులు కిట్స్ పొందడం జరిగినది. ఈ మందులు కిట్స్ ప్రతి రోగికి మందులు వాడుకునే విధానం అర్దం అయ్యే రీతిగా ముద్రించిన ప్రత్యేక ఒక పేపర్ కవర్ లో ఉంచి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 1213 మంది తదుపరి చికిత్స కోరకు పెద్ద ఆసుపత్రులకు తరలించడం ద్వారా అక్కడ వారికి సరైన వైద్యం అందించి వారి వెన్నంటి ఉంటామని చెప్పడం జరిగినది. అంతేకాకుండా వీరిలో 3,313 మంది గర్భిణీ స్త్రీలు, బాలింతలు వైద్య సేవలు పొందడం జరిగినది. ఈ మేళా కు వచ్చిన రోగులకు పోషకాహారం,యెగా, గర్భిణీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఫ్లీఫ్ బుక్ ఉపయోగించి ఆరోగ్య అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం మరియు ఇతర ఆరోగ్య అవగాహన కల్పించడం జరుగుతుంది. వైయస్సార్ కంటివెలుగు చికిత్స లో భాగంగా ఈ శిబిరాలలో 10,108 మంది కంటి పరీక్షలు చేసి ఉచితం మందులు పంపిణీ చేయగా వారిలో అవసరమైన 3,882 మందికి కంటి అద్దాలు కూడా ఉచితంగా పంపిణీ చేశామన్నారు.1,309 మందికి కాటరాక్టు ఆపరేషన్ లు అవసరం అని గుర్తించడం జరిగినది. ఈవైద్య శిబిరాలలో 111 ప్రత్యేక వైద్యునిపుణులు వైద్య సేవలు అందించారన్నారు. ఈ మేళాకు వచ్చి వైద్య సేవలు పోందిన ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత ఆరోగ్య సమాచారం, చికిత్స వివరాలు పొందుపరిచిన ఫైల్,గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఫోటో ముద్రించిన ఒక బ్యాగు లో వుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజలందరూ జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కలెక్టర్ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *