– డి సి హెచ్ ఎస్ డా ఎమ్. సనత్ కుమారి
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నిడదవోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్న ఎనిమిది మంది శానిటేషన్ సిబ్బందికి జీతాలు జమ చేయడం జరిగిందని డి సి హెచ్ ఎస్ డా ఎమ్. సనత్ కుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం నిడదవోలు మండల పరిధిలో నిర్వహించిన జగనన్న కు చెబుదాం మండల స్థాయి కార్యక్రమంలో జీతాలు అందటం లేదని సి హెచ్ సి లో పని చేస్తున్న సిబ్బంది జాయింట్ కలెక్టర్ కు, స్థానిక శాసన సభ్యులకు అర్జిని ఇవ్వడం జరిగిందన్నారు. ఈ మేరకు సంబంధిత ఏజెన్సీ తో మాట్లాడి సమస్య ను 24 గంటల వ్యవధిలో పరిష్కారం చేసినట్లు సనత్ కుమారి పేర్కొన్నారు. జేకేసి లో వచ్చే ఫిర్యాదుల విషయంలో జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోవడం తో సమస్యలకు పరిష్కారం చెయ్యడం జరుగుతున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News