-లక్షలాది మందికి మంచి చేసిన వైఎస్ఆర్ బాటలో నేడు జగన్ మోహన్ రెడ్డి నడుస్తున్నాడు – వెలంపల్లి
-ఇంటి వద్దనే 7 టెస్తులు చేసి తగు వైద్యం అందిస్తున్నాం – వెలంపల్లి
-భువనేశ్వరి చేసే యాత్రలో చంద్రబాబు చేసిన అవినీతిని ప్రజలకు తెలియచేయాలి – వెలంపల్లి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక 40వ డివిజన్ విజేత పబ్లిక్ స్కూల్ నందు గురువారంనాడు నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు నీ మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ ఈ రోజు 122వ సచివాలయం పరిదిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు.అధికారులు అందరి సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందన్నారు.దేశంలో ఎక్కడ లేనివిధంగా మన రాష్ట్రంలో చేపట్టం జరిగిందన్నారు.లక్షలాది మందికి మంచి చేసిన వైఎస్ఆర్ బాటలో నేడు జగన్ మోహన్ రెడ్డి నడుస్తున్నడని కొనియాడారు.ఇంటి వద్దనే 7 టెస్తులు చేసి తగు వైద్యం అందిస్తునట్లు తెలిపారు.ప్రజా ఆరోగ్యానికి పెద్ద పిట వేస్తున్నా వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు.గతంలో సచివాలయం వ్యవస్థను చంద్రబాబు,పవన్ కల్యాణ్ హేళన చేశారని ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు.ప్రతి పేదవాడికి పథకాలు ఇస్తున్నామని తెలిపారు.భువనేశ్వరి చేసే యాత్రలో చంద్రబాబు చేసిన అవినీతిని ప్రజలకు తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు.భువనేశ్వరి ముసలి కన్నీరు కాస్తున్నారు.ప్రజలకు మీరు ఏమి చెప్తారో తెలియచేయాలన్నారు.ప్రజలకు క్షమాపణ కోరాలని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,40వ డివిజన్ కార్పొరేటర్ యరడ్ల అంజనేయ రెడ్డి,సానికొమ్ము వెంకటేశ్వర రెడ్డి,కళ్లెం కృష్ణ రెడ్డి,రోసిరెడ్డి,శివరామి రెడ్డి,గంపల నవీన్,నడికట్టు రమణ రెడ్డి,రమణయ్య, జేవిఅర్,కొండలరావు,జిల్లా వైద్య శాఖ అధికారి సుహాసిని,వివిధ డివిజన్ల కార్పొరేటర్లు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు పార్టీ నాయకులూ కార్యకర్తలు అభిమానులు సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News