Breaking News

నిరుద్యోగ యువతకు ఆన్లైన్ ద్వారా సేవలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుద్యోగ యువతకు ఆన్లైన్ ద్వారా సేవలను అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఉపాధి మరియు శిక్షణ కోసం రూపొందించిన గొడప్రతిని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లా కు చెందిన నిరుద్యోగ యువతకు, అభ్యర్థులకు onlineలో సేవలు, ఎంప్లాయి మెంట్ సేవలను వెబ్ సైట్ employment. ap.gov.in ద్వారా సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. జిల్లా ఉపాధి కార్యాలయం, ద్వారా అందించే రిజిస్ట్రేషన్, రెన్యూవల్స్, రీసోర్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్ మరియు మొబైల్ ద్వారా కూడా తాము ఉన్న చోట నుండే సేవలను సులభంగా పొందవచ్చునన్నారు. అభ్యర్థులు online లో దరఖాస్తు చేసిన ఎడల వారికి లాగిన్ వివరములు మరియు తాత్కాలిక రిజి స్టేషన్ నంబర్ వెంటనే SMS ద్వారా పంపడం జరుగుతుందని అన్నారు. జిల్లా ఉపాధి అధికారి వారు దరఖాస్తు వారి అభ్యర్థనను ఆమోదించిన పిదప వారికి SMS ద్వారా ఎం ప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ తెలియచేయబడునని అధికారులు తెలిపారు. అభ్యర్థి తన ఎంప్లాయి మెంట్ ఆర్డర్ ను లాగిన్ ద్వారా డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం కలదు. ఇది వరకు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఎంప్లాయిమెంట్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు మీ పాత ఎంప్లాయిమెంట్ కార్డు నంబరుతో వివరాలను సరిచూసుకుని మీయొక్క కొత్త ఎంప్లాయిమెంట్ కార్డును పొందవచ్చునని జిల్లా ఉపాధి అధికారి కె.హరిశ్చంద్ర ప్రసాద్ తెలియ జేయడమైనది. పైనతెలిపిన సేవలను ఈరోజు నుండి వినియోగించుకో వలసి నదిగా అభ్యర్థులకు తెలియ జేయడమైనది. ఇతర సహాయం కొరకు కార్యాలయపనివేళలో 10.30 నుండి 5.గంవరకు 709366813 నంబర్లును సంప్రదించగలరు. 8328486787 సంప్రదించాలని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *