రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ పరిధిలో స్పందనలో వచ్చిన ప్రతి అర్జీ క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడు సృతృప్తి చెందే విధంగా సత్వర పరిష్కరించడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రజల నుంచి 16 అర్జీలను స్వీకరించామన్నారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చే అర్జీల విషయంలో సత్వర పరిష్కారం కోసం అధికారులు, సిబ్బంది జవాబుదారీ తనం తో కూడి సేవలు అందించాలని ఆదేశించారు. రాజమహేంద్రవరం పరిధిలోని లాలాచెరువు బాంబే కాలనీ లో పార్కింగ్ సమస్య తీర్చవలసినదిగా కోరుట, రహదారికి అడ్డంగా వున్న చెట్టును తొలగించవలసిందిగా అభ్యర్థన, డ్రైనేజీ, రోడ్లు శుభ్రపరచవలసిందిగా కోరుట, డ్రైనేజీ నిర్మాణం, సూర్య శెట్టి సత్యవతి మహిళ తన రేషన్ కార్డు నందు ఆమె ముగ్గురు పిల్లలను కూడా జత చేయవలసినదిగా కోరుట వంటి అంశాలకు సంబంధించి 16 వినతులను స్వీకరించామన్నారు. స్పందన కార్యక్రమంలో లో మున్సిపల్ అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి, సూపరింటెండెంట్ ఇంజనీర్ జి. పాండురంగారావు, సిటీ ప్లానింగ్ అధికారి జివిఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Tags Rājamahēndravaraṁ
Check Also
చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …
Prajavartha Online Telugu News