– జిల్లా ఉపాధి అధికారి హరిశ్చంద్ర ప్రసాద్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో జనవరి 25 వ తేదీ గురువారం ఉదయం 09:30 గంటలకు ఎస్ బి ఐ లైఫ్ , టాటా ట్రెంట్ లిమిటెడ్, అపోలో ఫార్మసీ కొరకు ఫర్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, ఫార్మసీ ట్రైనీ, సేల్స్ ఎక్జిక్యూటివ్, లైఫ్ మిత్రస్, డెవలప్మెంట్ మేనేజర్స్ కొరకు జిల్లా ఉపాధి కార్యాలయం, షెల్టన్ హోటల్ సమీపంలో, హెచ్ పీ పెట్రోల్ పంప్ వెనుక, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా నందు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. హరిచంద్ర ప్రసాద్ సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ మరియు ఆంధ్ర ప్రదేశ్ అంతటి ప్రాంతాలలో పని చేయాల్సింది ఉంటుందన్నారు. దీనికి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బీ/ఎం/డి ఫార్మసీ వరకు చదువుకున్న 18-40 సం.ల వయసు గల నిరుద్యోగ యువతి, యువకులు అర్హులు. వీరికి జీతం రు. 10,000/- నుంచి 18,000/- రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. సహాయం కొరకు 8247437773 నెంబర్ సంప్రదించగలరు.
Prajavartha Online Telugu News