-వ్యవసాయ శాఖ డైరీ ఆవిష్కరణ చేసిన కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
చిరు ధాన్యాలు ద్వారా ఎంతో పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీ లత పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ లో వ్యవసాయ శాఖ అసోసియేషన్ డైరీ ని, చిరు ధాన్యాలతో 100 పిండి వంటలు పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, 2023 వ సంవత్సరాన్ని ఐక్య రాజ్య సమితి చిరు ధాన్యాలు ఏడాదిగా ప్రకటించి, ఆమేరకు మిల్లెట్స్ సాగు విస్తీర్ణం పెంచడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా వారు తీసుకునే ఆహారపు అలవాట్ల లో చిరు ధాన్యాలు వినియోగం పెంచాల్సి ఉందన్నారు. ఆమేరకు చిరు ధాన్యాలుతో సుమారు 100 వంటలు పుస్తకం రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రూపొందించి చిరు ధాన్యాలు ఆహారపు అలవాట్లు పై ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అవగాహన అవసరం అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జి. నరసింహులు, స్పెషల్ డి సి/ పర్యాటక శాఖ ఆర్ డి వి. స్వామి నాయుడు , డీఏవో డాక్టర్ ఎస్.మాధవరావు, వ్యవసాయ జిల్లా అధ్యక్షులు – డాక్టర్ డి.వి.కృష్ణ ఉపాధ్యక్షుడు – డాక్టర్ డి.కె. మల్లికార్జున్ కార్యదర్శి – డాక్టర్ కమల్ రాజ్. కె సంయుక్త కార్యదర్శి – డాక్టర్ రాజారావు. బి కోశాధికారి – డాక్టర్ రామ తులసి. డి మరియు వ్యవసాయ అధికారులందరూ హాజరయ్యారు.
Prajavartha Online Telugu News